భారత ప్రభుత్వం 15 సెప్టెంబర్, 2023 నుంచి అక్టోబర్ 2, 2023 వరకు స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్నినిర్వహిస్తోంది. నీలం షామీ రావు, IAS, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలంగాణకు మంత్రిత్వ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా నామినేట్ అయ్యారు. ఈ స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగానీలం శమీ రావు (IAS), సెంట్రల్ పీఎఫ్ కమీషనర్ (EPFO), ప్రాంతీయ కార్యాలయం, బర్కత్‌పురా సందర్శించడం జరిగింది అలాగే స్వచ్ఛతా హి సేవా ప్రచారంపై సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణాన్ని ఆమె పరిశీలించి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరు పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యంగా ఉంటామని, అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. స్వచ్ఛతా పాటించినప్పుడే భారతదేశం పరిశుభ్రంగా తయారు అవుతుందన్నారు. స్వచ్ఛతా హి సేవా స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని ఆమె సూచించారు. సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ తెలంగాణ వైశాలి దయాల్, అలాగే ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్ డాక్టర్ శివ కుమార్, బర్కత్‌పురా ప్రాంతీయ కార్యాలయ పీఎఫ్ కమీషనర్ సౌరభ్ జగతి కూడా సమావేశానికి హాజరయ్యారు.
ఇంకా, ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలోని వివిధ శాఖలు, అలాగే సంస్థల స్వచ్ఛతా హి సేవా ప్రచారం నోడల్ అధికారులతో స్వచ్ఛతా హి సేవా ప్రచారంపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు విషయాల పై అవగాహన కార్యక్రం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం నీలం శమీ రావు (ఐఏఎస్) స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యాలయాలను సందర్శించారు.
అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖనం, పలు రకాల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల లో గెలుపొందిన వారి కి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) లో బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు. స్వచ్ఛతా హి సేవా 2023లో ఊహించినట్లు గా, 2023 అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ‘ఏక్ తారీఖ్- ఏక్ ఘంటా’ పేరు తో 1 అక్టోబర్ 2023న పరిశుభ్రత భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని నిజమైన స్ఫూర్తితో అమలు చేయాల ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ లో ని నోడల్ అధికారులందరికీ ఫండ్ కమిషనర్ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి