Telangana Rainfall: తెలంగాణ రాష్ట్రంలోని ఆ ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు.. వెల్లడించిన వాతావరణ శాఖ

Telangana Rainfall: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా..

Telangana Rainfall: తెలంగాణ రాష్ట్రంలోని ఆ ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు.. వెల్లడించిన వాతావరణ శాఖ
Follow us
Subhash Goud

| Edited By: Anil kumar poka

Updated on: Sep 14, 2021 | 3:58 PM

Telangana Rainfall: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి. ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గేట్లను ఎత్తి దిగువన వదులుతున్నారు. ఇక రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా నమోదైంది. 21 జిల్లాల్లో అధిక వ‌ర్షపాతం (20 నుంచి 50 శాతం మ‌ధ్యలో) న‌మోదు కాగా, ఏడు జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్షపాతం న‌మోదైంది. ఏ ఒక్క జిల్లాల్లోనూ వర్షపాతం తక్కువ నమోదైనట్లు లేదు. అన్ని జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి.

జూన్ 5వ తేదీన రాష్ట్రాన్ని నైరుతి రుతుప‌వ‌నాలు తాకాయి. వారం రోజుల ముందే నైరుతి రుతుప‌వ‌నాలు రాష్ట్రంలో విస్తరించాయి. ఇప్పటికీ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు యాక్టివ్‌గా ఉన్నాయి. జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 12వ తేదీ వ‌ర‌కు 873.9 మి.మీ. వ‌ర్షపాతం (సాధార‌ణ వ‌ర్షపాతం 650.9 మి.మీ.) న‌మోదైంది. అంటే సాధార‌ణ వ‌ర్షపాతం కంటే 34 శాతం ఎక్కువ న‌మోదు అయ్యింది. గ‌త సంవత్సరం ఇదే స‌మ‌యానికి 863.9 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో..

కాగా, ఈ సంవత్సరం సిద్దిపేట జిల్లాలో 95 శాతం, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో 76 శాతం, వ‌రంగ‌ల్ అర్బన్‌లో 75 శాతం, నారాయ‌ణ‌పేట‌లో 72 శాతం, క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 64 శాతం అధిక‌ వ‌ర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక సూర్యాపేట, ములుగు, నాగ‌ర్‌క‌ర్నూల్, సంగారెడ్డి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో సాధార‌ణ వ‌ర్షపాతం నమోదు అయ్యింది.

రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ మీదుగా ప్రయాణించి.. 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నట్టుగా తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఇక ఈరోజు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.

ఇవీ కూడా చదవండి: Rain Alert: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు..

Booster Dose: మూడో డోసు కరోనా వ్యాక్సిన్‌ అవసరం లేదు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు