Ganesh Navaratri 2021: ఇంటికో ఉద్యోగి.. 58 ఏళ్లుగా ఊరంతా ఓకే గణపతి.. పూర్తి మ్యాటర్ తెలిస్తే వావ్ అంటారు..
Ganesh Navaratri 2021: గణపతి నవరాత్రులు అంటేనే ఊరంతటికీ అదో పెద్ద పండగ.. కాలనీలు, వీధులు, వాడవాడల వెలసిన వినాయక విగ్రహాలతో పల్లె పట్నం మారుమార్మోగిపోతుంది.
Ganesh Navaratri 2021: గణపతి నవరాత్రులు అంటేనే ఊరంతటికీ అదో పెద్ద పండగ.. కాలనీలు, వీధులు, వాడవాడల వెలసిన వినాయక విగ్రహాలతో పల్లె పట్నం మారుమార్మోగిపోతుంది. మట్టితో, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు తొమ్మిది లేదా 11 రోజులపాటు ధూప దీప నైవేధ్యాలతో పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు. కానీ ఆ ఊళ్ళో ప్రతిష్టించిన వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. మరేం చేస్తారు.. అనే కదా మీ సందేహం.. అదేంటో ఇప్పుడు చూద్దాం..
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బోసి అనే గ్రామం ఉంది. దేశమంతా ఘనంగా వినాయక విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. ఇక్కడ మాత్రం ఊరంతా ఒకే ఒక్క వినాయకుడు దర్శనమిస్తాడు. అది కూడా మట్టితోనో, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనో తయారు చేసింది కాదు. కేవలం కర్రతో తయారు చేసిన గణపతి ప్రతిమ. గత 58 సంవత్సరాలుగా ఇక్కడి గ్రామంలో కర్రవినాయకుడినే కొలుస్తున్నారు గ్రామస్తులు. వినాయక చవితి సందర్భంగా ఓ కర్ర వినాయకుడి విగ్రహాన్ని అన్ని గ్రామాల్లో లాగే ప్రతిష్టిస్తారు. ఆ తరువాత 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం చేయకుండా బావి నీళ్లను చల్లి లక్ష్మీనారాయణ ఆలయంలో భద్రపరుస్తారు. తర్వాత సంవత్సరం ఉత్సవాలకు విగ్రహానికి రంగులద్ది. ప్రతిష్టించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
ఏటా ఇదే విగ్రహాన్ని పూజిస్తుండడంతో గ్రామం సిరిసంపదలతో సుఖ సంతోషాలతో ఉందని గ్రామస్తులు ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. నిర్మల్ కు చెందిన కళాకారులు పోలకొండ గుండాజీ తయారు చేసిన ఈ విగ్రహానికి 51 రూపాయలు చెల్లించి తీసుకువచ్చారట. రంగులు అద్ది అప్పటి నుంచి నిమజ్జనం చేయకుండా ఏటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కాగ, ఈ రోజుల్లో బోసిలో మాత్రం ఒకే వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామస్తులంతా కలిసి పూజలు నిర్వహిస్తూ ఐక్యతను చాటుతున్నారు. కర్రవినాయకుడికి పూజలు నిర్వహిస్తుండడంతోనే గ్రామంలో విద్యావంతుల సంఖ్య అధికమవుతూ.. పట్టభద్రవులతున్నారని గ్రామస్తుల నమ్మకం. ప్రభుత్వ కొలువుల్లో నియోజకవర్గంలోనే గ్రామానికి ప్రత్యేకత ఉంది. దాదాపు ఇంటికో ఉద్యోగి ఉన్నారు. అంతేకాదు వ్యాపారల్లోనూ ముందడుగు వేస్తున్నారు అని గ్రామస్తులు చెబుతున్నారు. మరి ఈ గ్రామం అందరికీ ఆదర్శమే కదా!
Also read:
Paata Uttej: నా భవిష్యత్తుని ఇలా వదిలేశావ్ ఏంటమ్మ.. కన్నీరు పెట్టిస్తున్న ఉత్తేజ్ కూతురి పోస్ట్..
Knipakam: కరోనా నిబంధనల నడుమ కాణిపాకంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు.. నేడు చిన్న, పెద్ద వాహన సేవలు..