AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై TG-SAFE ఉక్కుపాదం!

తెలంగాణలో టీనేజర్లే టార్గెట్‌గా టాపెంటాడాల్‌ మందుల విక్రయిస్తున్న మెడికల్ షాప్‌లపై TG-SAFE అధికారులు ఉక్కుపాదం మోపారు. మేడ్చల్‌లోని ఓ మెడికల్ షాపులో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్న టాపెంటాడాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు లేకపోవడం, నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మందులు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని మెడికల్ షాపులను హెచ్చరించారు.

టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై TG-SAFE ఉక్కుపాదం!
Illegal Tapentadol Sale To Teens Spurs Raids
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 5:01 PM

Share

టీనేజర్లను టార్గెట్‌ చేసుకుని అలవాటు చేసే మందులను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో తెలంగాణ ఫుడ్‌, ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (TG-SAFE), ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారంలోని ఓ మెడికల్‌ షాపులో గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాపెంటాడాల్‌ మాత్రల నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజులరామారంలో ఉన్న మనా ఫార్మసీ అండ్‌ జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు పరిసర ప్రాంతాల్లోని టీనేజర్లకు అలవాటు చేసే డ్రగ్‌గా పేరున్న టాపెంటాడాల్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో TG-SAFE, ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు సంయుక్తంగా మెడికల్‌ షాపుపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే టాపెంటాడాల్‌ మాత్రలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు ఇవ్వకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షెడ్యూల్‌ H1 మందుల విక్రయాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిన రిజిస్టర్‌లోనూ ఎలాంటి వివరాలు నమోదు చేయలేదని తేలింది. దీంతో అధికారులు Tapentadol 100 mg మాత్రలతో పాటు వాటి కొనుగోలు ఇన్వాయిస్‌లు, సేల్స్‌ బిల్‌ బుక్స్‌, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తదుపరి దర్యాప్తులో పరిశీలించనున్నారు.

టాపెంటాడాల్‌ అంటే ఏమిటి?

టాపెంటాడాల్‌ ఒక ఓపియాయిడ్‌ నొప్పి నివారణ మందు. మోస్తరు నుంచి తీవ్రమైన నొప్పి చికిత్సలో వైద్యుల సూచన మేరకు దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇది అలవాటు పడే అవకాశం ఉన్న మందు కావడంతో షెడ్యూల్‌ H1 డ్రగ్‌గా వర్గీకరించారు. చెల్లుబాటు అయ్యే వైద్య ప్రిస్క్రిప్షన్‌ ఉన్నప్పుడే దీనిని విక్రయించాల్సి ఉంటుంది. మెడికల్‌ షాపులో స్వాధీనం చేసుకున్న మందులు, రికార్డుల ఆధారంగా TG-SAFE అధికారులు తదుపరి దర్యాప్తు చేపట్టనున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మందులను విక్రయించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలవాటు చేసే మందులు, ప్రిస్క్రిప్షన్‌ అవసరమైన ఔషధాలను అక్రమంగా మళ్లించడం లేదా విచ్చలవిడిగా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని TG-SAFE మెడికల్‌ షాపులను హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రోహిత్ శర్మ రేర్ క్లబ్‌లో చేరిన స్మృతి మంధాన
రోహిత్ శర్మ రేర్ క్లబ్‌లో చేరిన స్మృతి మంధాన
టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై
టీనేజర్లే టార్గెట్‌గా నిషేదిత మందుల విక్రయాలు.. మెడికల్ షాప్‌లపై
ఒంటి కాలితో గెంతుతూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన!
ఒంటి కాలితో గెంతుతూ బడికి.. ఏడేళ్ల చిన్నారి చదువుకోవాలన్న తపన!
మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..?
మనిషి చనిపోయాక ఆధార్, పాన్, ఓటర్ ఐడీలను ఏం చేయాలి..?
అడవిలో పులి గురించి అన్ని జీవుల్ని అలెర్ట్ చేసే జీవి ఏదో తెలుసా..
అడవిలో పులి గురించి అన్ని జీవుల్ని అలెర్ట్ చేసే జీవి ఏదో తెలుసా..
హిందీ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ మన హీరోని అంటాడా.?
హిందీ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసుకుంటూ మన హీరోని అంటాడా.?
ఆ రికార్డుల్లో హిట్ మ్యాన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
ఆ రికార్డుల్లో హిట్ మ్యాన్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు
IRCTC చార్‌ధామ్ యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా 4 ధామాల దర్శనం
IRCTC చార్‌ధామ్ యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ సహా 4 ధామాల దర్శనం
హృదయాలను హత్తుకునే వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
హృదయాలను హత్తుకునే వీడియో.. చూస్తే కన్నీళ్లు ఆగవు!
చదువే కాకుండా.. జీవిత పాఠాలు చెప్పిన గురువులకు టీచర్స్ డే
చదువే కాకుండా.. జీవిత పాఠాలు చెప్పిన గురువులకు టీచర్స్ డే