5

యాదాద్రిలో ఉద్రిక్తత, బీజేపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్‌

యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి ఆలయ పిల్లర్లపై ఏర్పాటు చేసిన బొమ్మలు వివాదాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో సహా ఎమ్మెల్యే రాజాసింగ్, కొందరు బీజేపీ నేతలు, బీజేపీ శ్రేణులు రాయగిరి నుండి యాదాద్రి వరకు ర్యాలీగా చేరుకొని కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు లక్ష్మణ్, రాజాసింగ్ తో పాటు కొందరు నేతలను మాత్రమే కొండమీదకి అనుమతిస్తామన్నారు. అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో […]

యాదాద్రిలో ఉద్రిక్తత, బీజేపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్‌
Follow us

|

Updated on: Sep 07, 2019 | 7:01 PM

యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి ఆలయ పిల్లర్లపై ఏర్పాటు చేసిన బొమ్మలు వివాదాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో సహా ఎమ్మెల్యే రాజాసింగ్, కొందరు బీజేపీ నేతలు, బీజేపీ శ్రేణులు రాయగిరి నుండి యాదాద్రి వరకు ర్యాలీగా చేరుకొని కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు లక్ష్మణ్, రాజాసింగ్ తో పాటు కొందరు నేతలను మాత్రమే కొండమీదకి అనుమతిస్తామన్నారు. అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అక్కడ్నుంచి తరలించారు. యాదాద్రి ప్రధానాలయం రాతిస్తంభాలపై చెక్కిన రాజకీయ చిత్రాలు, బొమ్మలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పలు రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు ఆందోళన నిర్వహించాయి. దక్షిణ దిశలోని స్తూపాలపై సీఎం కేసీఆర్‌ బొమ్మ, కారు గుర్తు, కేసీఆర్‌ కిట్‌, మహాత్మగాంధీ, మాజీ ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్‌గాంధీ, పీర్ల పంజా, పంచకల్యాణి, చార్మినార్‌ బొమ్మలను చెక్కారని హిందూ సంస్థలు ఆరోపించాయి. ఈ మేరకు శుక్రవారం యాదాద్రీ వెళ్లిన రాజకీయ,హిందూ సంస్థల నేతలు ఆలయ మండప ప్రాకారాలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించాలని రాజగోపురం ఎదుట నిరసన చేపట్టారు. వీటిని మూడు రోజుల్లోగా తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. మండప ప్రాకారాల్లో భక్తితత్వాన్ని పెంపొందించే దిశలో కాకుండా ఇతర మత చిహ్నాలను, రాజకీయ నేతల బొమ్మలు చెక్కడం విడ్డూరమని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరినీ అనుమతించేది లేదని ఆంక్షలు విధించారు.

ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్ సేల్'.. అమితాబ్‌పై ఆగ్రహం
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
ICC World Cup: వన్డే ప్రపంచకప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం రండి..
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
'ఆ బర్రె పిల్ల రతికకు నేనేం అన్యాయం చేశాను' రైతు బిడ్డ ఎమోషనల్
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీ, అమిత్‌షాలతో భేటీ
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా..? తాజా రేట్లు ఇవే..
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్‌ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
ముంబై సిద్ధి వినాయక ఆలయంలో రామ్‌చరణ్‌ పూజలు.. అయ్యప్ప దీక్షవిరమణ
'నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
'నీ ఆనందం కోసం ఎందాకైనా వెళ్తా'.. మౌనికకు మనోజ్ బర్త్ డే విషెస్
Actress: చీరలో చూపుతిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా?
Actress: చీరలో చూపుతిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా?
ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ ఆడియెన్స్‌ గెట్‌ రెడీ.. ఈ శుక్రవారం 27 సినిమాలు, సిరీస్‌లు
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం చెప్పేసిన సింగర్
త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మంగ్లీ.. అసలు విషయం చెప్పేసిన సింగర్