సాగర్‌ టూ శ్రీశైలం..రోడ్‌ కమ్‌ రివర్‌ టూర్‌

ప్రకృతి సౌందర్యాలను చూసేందుకు టూరిజం ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు ఏర్పాటు చేసిన రోడ్‌ కమ్‌ రివర్‌ క్రూజ్‌ టూర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..గతంలో కాళేశ్వరం, వరంగల్‌ జిల్లాలోని ప్రాచీన కట్టడాలను చూసేందుకు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు […]

సాగర్‌ టూ శ్రీశైలం..రోడ్‌ కమ్‌ రివర్‌ టూర్‌
Follow us

|

Updated on: Sep 07, 2019 | 7:40 PM

ప్రకృతి సౌందర్యాలను చూసేందుకు టూరిజం ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు ఏర్పాటు చేసిన రోడ్‌ కమ్‌ రివర్‌ క్రూజ్‌ టూర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, ఎండీ మనోహర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..గతంలో కాళేశ్వరం, వరంగల్‌ జిల్లాలోని ప్రాచీన కట్టడాలను చూసేందుకు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఇవాళ నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు వెళ్లేందుకు హైదరాబాద్‌లో బస్సు బయల్దేరి నందికొండ వరకు బస్సు ప్రయాణం, అక్కడి నుంచి లాంచీలో శ్రీశైలానికి పోయి అక్కడినుంచి బస్సులో హైదరాబాద్‌కు తీసుకువస్తారని పేర్కొన్నారు. అతి తక్కువ ధరకే ఈ ప్యాకేజీని అందిస్తున్నామని స్పష్టం చేశారు. అద్భుతమైన సౌందర్య దృశ్యాలు తెలంగాణలో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ టూరింజను మరింత అభివృద్ధి చేయాలని కోరారు.. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల చుట్టు పక్కల టూరిజం స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారని మంత్రి తెలిపారు.