ఏన్కూరు, జనవరి 22: ఇన్‌స్ట్రాగామ్ ద్వారా మూడేళ్ల పాటు ప్రేమించిన ట్రాన్స్‌జెండర్‌ను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం ఏన్కూరు మండలం గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం (జనవరి 21) జరిగింది. ఖమ్మం జిల్లా ఏన్కూరులో నక్షత్ర అనే ట్రాన్స్‌జెండర్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ఆజ్మీర నందు అనే యువకుడితో మూడేళ్ల క్రితం ఇన్‌స్టా గ్రాంలో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా అనతికాలంలోనే ప్రేమగా మారింది. దీందో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరి ప్రేమను నందు తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో వారు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయాన్ని ట్రాన్స్‌జెండర్ సంఘం సభ్యులకు తెలియజేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల ట్రాన్స్‌జెండర్‌లు ఏన్కూరు మండలంలోని గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నందు, నక్షత్రలకు ఆదివారం ఘనంగా పెళ్లి చేశారు.
బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లెదుటే భార్య, కుమారుడు మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. వివరాల్లోకెళ్తే.. కాగజ్‌నగర్ మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ సర్వర్ తన భార్య జహీరా (35), కుమారుడు ఆసిఫ్(16)తో కలసి బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం 7 గంటలకు ఆసిఫాబాద్‌లోని చిర్రకుంటలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌లోని అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద మంచిర్యాల వైపు నుంచి చంద్రాపూర్‌కు వెళ్తున్న కంటైనర్ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. దీంతో బైక్‌పై ఉన్న జహీరా, ఆసిఫ్ కంటైనర్ వెనక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. సర్వర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదే కంటైనర్ , క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి.
క్షతగాత్రులను నేషనల్ హైవేకు చెందిన 1033 వాహనంలో స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి చికిత్ నిమిత్తం తరలించారు. మృత దేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట చెక్‌పోస్టు మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగాయని, ఇప్పటికైనా దానిని మూసి వేయాలని స్థానికులు ప్రమాదస్థలం వద్ద డిమాండ్ చేశారు. అటుగావచ్చే వాహనాలను పట్టణంలోని గుండి రహదారి, సర్విస్ రోడ్డు మీదుగా జాతీయ రహదారిపైకి వాహనాలు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.