Telangana: వీళ్లు ట్రైన్ టికెట్స్ కొంటారు.. కానీ ప్రయాణం చేయరు.. ఎందుకో తెల్సా..?

టికెట్లు కొంటారు.. ప్రయాణం చేయరు... అంతేకాదు ఇలా ట్రైన్ టికెట్లు కొనేందుకు.. వ్యాపారులు, దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుండటం విశేషం. ఈ తంతు వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో జరుగుతోంది. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఇదే ఏకైక రైల్వేస్టేషన్‌. వీరు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి...

Telangana: వీళ్లు ట్రైన్ టికెట్స్ కొంటారు.. కానీ ప్రయాణం చేయరు.. ఎందుకో తెల్సా..?
What's app Group Members
Follow us

|

Updated on: Feb 12, 2024 | 11:12 AM

ఫిబ్రవరి 12: వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో కొందరు రోజూ 60కి పైగా ప్రయాణ టికెట్స్ కొంటారు. కానీ ఎక్కడికీ ట్రావెల్ చేయరు. అరె.. అలా ఎందుకు అని మీ డౌట్ వచ్చే ఉంటుంది. తమ ఊరి ట్రైన్ హాల్టింగ్ క్యాన్సిల్ కాకుండా ఉండేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఊర్లోని అన్ని వర్గాల వారు ఏకమయ్యారు. ట్రైన్ టికెట్స్ కొనేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున డొనేషన్స్ కూడా ఇస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి నెక్కొండ ఏకైక రైల్వేస్టేషన్‌‌గా ఉంది. నియోజవర్గంలోని పలు మండలాలకు చెందినవారు ఎటైనా పోవాలంటే.. ఇక్కడికే వస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, ఢిల్లి, శిర్డి వంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్లేవారు.. ఇక్కడ చాలా ట్రైన్స్ హాల్టింగ్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అది చాలదన్నట్లు ఆదాయం పెద్దగా లేదన్న సాకుతో.. రైల్వే అధికారులు… పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రిటన్ ప్రయాణంలో నెక్కొండ స్టేషన్‌లో హాల్టింగ్ క్యాన్సిల్ చేశారు.

స్థానిక ప్రజలు.. పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడంతో… ఇటీవల సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు టెంపరరీ హాల్టింగ్‌  ఇచ్చారు. అయితే రైల్వే అధికారులు ఓ కండీషన్ కూడా పెట్టారండోయ్. 3 నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తిస్థాయిలో హాల్టింగ్‌ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని చెప్పారు. దీంతో హాల్టింగ్‌ కోల్పోకూడదనుకున్న గ్రామస్థులు ఏకమయ్యారు. ఇందుకోసం ఏకంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ‘నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్‌ ఫోరం’ పేరుతో వాట్సప్‌ గ్రూపు క్రియేట్ చేశారు. ఇందులో సుమారు 400 మంది జాయిన్ అయ్యారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.25 వేలు సమకూర్చారు. ఈ డబ్బుతో రోజూ నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాలకు ట్రైన్ టికెట్స్ కొంటున్నారు. స్టేషన్‌కు ఇన్‌కం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్‌ కోసం అందరం కలిసి ముందుకు వెళ్తామని..  గ్రూపు అడ్మిన్లు రాంగోపాల్‌, వేణుగోపాల్‌రెడ్డి, వెంకన్న, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ లోక్ సభ టికెట్‎ కోసం త్రిముఖ పోటీ.. కీలక పదవికి సైతం రాజీనామా
ఆ లోక్ సభ టికెట్‎ కోసం త్రిముఖ పోటీ.. కీలక పదవికి సైతం రాజీనామా
కుళాయి నీళ్ల కోసం కాలయముడిగా మారిన కొడుకు.. భయాందోళనకు గురైన జనం
కుళాయి నీళ్ల కోసం కాలయముడిగా మారిన కొడుకు.. భయాందోళనకు గురైన జనం
న్యూయార్క్ నగరంలా మారనున్న భాగ్యనగరం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
న్యూయార్క్ నగరంలా మారనున్న భాగ్యనగరం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
మిషన్ సౌత్ వర్కౌట్ ఆయ్యేనా.. కమలదళం వ్యూహమేంటి..
మిషన్ సౌత్ వర్కౌట్ ఆయ్యేనా.. కమలదళం వ్యూహమేంటి..
భగవద్ రామానుజ, 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు..
భగవద్ రామానుజ, 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు..
వేసవి కాలం ఇంట్లో మొక్కల సంరక్షణ కోసం సింపుల్ చిట్కాలు..
వేసవి కాలం ఇంట్లో మొక్కల సంరక్షణ కోసం సింపుల్ చిట్కాలు..
క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ఆ విషయంలో జాగ్రత్తగా లేకపోతే అంతే
క్రెడిట్ కార్డు మూసేస్తున్నారా? ఆ విషయంలో జాగ్రత్తగా లేకపోతే అంతే
ఫోన్ స్క్రీన్‌పై కాలర్ పేరు..టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశం
ఫోన్ స్క్రీన్‌పై కాలర్ పేరు..టెలికాం కంపెనీలకు ట్రాయ్‌ కీలక ఆదేశం
బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించని సందడి.! మళ్ళీ చిన్న సినిమాలే ఫన్.
బాక్స్ ఆఫీస్ వద్ద కనిపించని సందడి.! మళ్ళీ చిన్న సినిమాలే ఫన్.
మీ గొంతును కాపీ కొట్టి మోసం చేసే వాయిస్ క్లోనింగ్ స్కామ్
మీ గొంతును కాపీ కొట్టి మోసం చేసే వాయిస్ క్లోనింగ్ స్కామ్
మీ గొంతును కాపీ కొట్టి మోసం చేసే వాయిస్ క్లోనింగ్ స్కామ్
మీ గొంతును కాపీ కొట్టి మోసం చేసే వాయిస్ క్లోనింగ్ స్కామ్
ప్రేమ కలిపింది.. పాల వ్యాను ప్రాణం తీసింది.! ఘోర రోడ్డు ప్రమాదం.
ప్రేమ కలిపింది.. పాల వ్యాను ప్రాణం తీసింది.! ఘోర రోడ్డు ప్రమాదం.
అర్ధరాత్రి నడివీధిలో ఎగసిపడిన మంటలు..అసలేం జరిగింది.? వీడియో.
అర్ధరాత్రి నడివీధిలో ఎగసిపడిన మంటలు..అసలేం జరిగింది.? వీడియో.
మాల్దీవుల జలాల్లోకి చైనా నౌక.! భారత్‌పై నిఘాపై డ్రాగన్‌ కుట్ర.
మాల్దీవుల జలాల్లోకి చైనా నౌక.! భారత్‌పై నిఘాపై డ్రాగన్‌ కుట్ర.
దేశంలో త్వరలో రిలయన్స్‌ నుంచి ‘హనుమాన్’.. చాట్ జీపీటీకి పోటీ.!
దేశంలో త్వరలో రిలయన్స్‌ నుంచి ‘హనుమాన్’.. చాట్ జీపీటీకి పోటీ.!
వైద్యుడి నిర్వాకం.. తోపుడు బండి వ్యాపారిని ఢీకొట్టి పరార్! వీడియో
వైద్యుడి నిర్వాకం.. తోపుడు బండి వ్యాపారిని ఢీకొట్టి పరార్! వీడియో
అర్థరాత్రి హైటెన్షన్‌ స్థంభం ఎక్కిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?
అర్థరాత్రి హైటెన్షన్‌ స్థంభం ఎక్కిన వ్యక్తి.. ఏం జరిగిందంటే?
సొంత పిల్లల్ని వేధించిన రాక్షసి అరెస్ట్ .. 60 ఏళ్ల జైలుశిక్ష.!
సొంత పిల్లల్ని వేధించిన రాక్షసి అరెస్ట్ .. 60 ఏళ్ల జైలుశిక్ష.!
భారత్‌-చైనా మధ్య అత్యున్నత స్థాయి సైనిక చర్చలు..
భారత్‌-చైనా మధ్య అత్యున్నత స్థాయి సైనిక చర్చలు..
1994లో హత్య 2024లో కేసును ఛేదించిన పోలీసులు! అదిరిపోయే ట్విస్ట్.
1994లో హత్య 2024లో కేసును ఛేదించిన పోలీసులు! అదిరిపోయే ట్విస్ట్.