Amazon: వికారాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు

|

Dec 09, 2024 | 2:42 PM

తెలంగాణ కుర్రోడు దిగ్రజ వ్యాపార సంస్థ అమెజాన్ లో భారీ ప్యాకేజీతో కొలువు దక్కించుకున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో చదువుకుని అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన అమెజాన్ లో ఉన్నత కొలువు దక్కడంటై గ్రామస్థులతో పాటు, తల్లిదండ్రులు సైగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Amazon: వికారాబాద్‌ కుర్రోడి సత్తా.. రూ.2 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో కొలువు
Job At Amazon
Follow us on

వికారాబాద్‌, డిసెంబర్‌ 9: తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఏకంగా గ్రోబల్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఏడాదికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో కొలువు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే ఆఫర్‌ లెటర్ కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం నుంచి ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అతనెవరో.. ఏం చదువుకున్నాడో.. ఆ వివరాలు మీకోసం..

వికారాబాద్‌ జిల్లాలోని బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్‌ ఖురేషీ గురించే మనం చర్చిస్తుంది. అర్బాజ్‌ ఖురేషీకి చిన్నప్పటి నుంచే చదువుపై మక్కువ ఎక్కువ. ఐఐటీ పట్నాలో బీటెక్‌లో సీటు దక్కించుకున్న అర్బాజ్‌ ఖురేషీ 2019లో ఖురేషీ కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ డిగ్రీ పూర్తి చేశాడు. బీటెక్ మూడో ఏడాదిలో ఉండగానే.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్‌ లెర్నింగ్‌ ఎక్స్‌ఫర్ట్ గేల్‌ డయాస్‌ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్‌ కూడా పూర్తి చేశాడు.

ఆ తర్వాత బెంగళూరులోని మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లో ఉద్యోగం రావడంతో.. అక్కడ రెండేళ్ల పాటు జాబ్ చేశాడు. అనంతరం అమెరికాకు వెళ్లి, అక్కడ యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నుంచి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్‌ లెర్నింగ్‌లో ఎంఎస్‌ పూర్తి చేశాడు. తాజాగా ప్రఖ్యాత వ్యాపార దిగ్గజం అమెజాన్ ఐటీ సంస్థలో కొలువు దక్కించుకున్నాడు. ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతనంతో సోమవారం నుంచి విధుల్లో చేరనున్నాడు. ఖురేషీ తండ్రి యాసిన్‌ ఖురేషీ కూడా తెలంగాణలో ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌గా ప్రస్తుతం పని చేస్తున్నారు. అర్బాజ్‌ ఖురేషీకి దక్కిన అరుదైన అవకాశం పట్ల తల్లిదండ్రులతో పాటు, గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.