Telangana Election Results 2023: కాంగ్రెస్ ఖిల్లాలో ఒంటరి పోరు.. హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్కడు..

రాష్ట్రంలో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ కు గట్టిపట్టున్న ఆ ఉమ్మడి జిల్లాలో కూడా 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ జిల్లాలో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలైనా, ఒక ఒక్కడు. ఆ మంత్రి మాత్రం కాంగ్రెస్‌తో పోరాటం చేసి గెలిచాడు. ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana Election Results 2023: కాంగ్రెస్ ఖిల్లాలో ఒంటరి పోరు.. హ్యాట్రిక్ కొట్టిన ఒకే ఒక్కడు..
Guntakandla Jagadish Reddy
Follow us
M Revan Reddy

| Edited By: Ravi Kiran

Updated on: Dec 05, 2023 | 8:12 AM

రాష్ట్రంలో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ కు గట్టిపట్టున్న ఆ ఉమ్మడి జిల్లాలో కూడా 11 స్థానాలను కైవసం చేసుకుంది. ఆ జిల్లాలో 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలైనా, ఒక ఒక్కడు. ఆ మంత్రి మాత్రం కాంగ్రెస్‌తో పోరాటం చేసి గెలిచాడు. ఆ మంత్రి ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజ నేతలంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హేమాహేమీలైన కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డిః, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సీనియర్ నేతలుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలో గులాబీ జెండా ఎగరడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి వంటి దిగ్గజాలు ఓటమి పాలయ్యారు.

ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని నల్లగొండను గులాబీ కొండగా మార్చింది. అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూ ఉండేది. ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శపధం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పవనాలు వేయడంతో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది.

దీంతో 11 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలయ్యారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే ఒక్కడు కాంగ్రెస్ పార్టీతో పోరాడి గెలిచాడు ఆయనే మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నుంచి పోటీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పై 4,606 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఒంటి చేతితో బీఆర్ఎస్‌ను గెలిపించిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌తో ఒంటరి పోరు చేసి విజయం సాధించారు. సూర్యాపేట నుంచి ఈ గెలుపుతో మంత్రి జగదీశ్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన గెలుపుతో బీఆర్ఎస్ ప్రాతినిధ్యాన్ని జగదీష్ రెడ్డి కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…