Telangana: ఇలాంటి గురువు కదా మనకు కావాల్సింది.. సెల్యూట్ మాస్టారూ..

|

May 19, 2023 | 9:18 PM

అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. క్లాసులో పాఠాలు చెప్పి మమా! అనిపిస్తే సరిపోతుందనుకునే ఈ రోజుల్లో.. పాఠశాలకు సెలవులిచ్చాక కూడా పిల్లల్ని విడవకుండా పొదివిపట్టుకొని పాఠాలు చెపుతున్న తీరు అందర్నీ అబ్బురపరుస్తోంది. వివరాల్లోకెళితే.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని గాజులగట్టు మీదుగా..

Telangana: ఇలాంటి గురువు కదా మనకు కావాల్సింది.. సెల్యూట్ మాస్టారూ..
Teacher
Follow us on

అతనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. క్లాసులో పాఠాలు చెప్పి మమా! అనిపిస్తే సరిపోతుందనుకునే ఈ రోజుల్లో.. పాఠశాలకు సెలవులిచ్చాక కూడా పిల్లల్ని విడవకుండా పొదివిపట్టుకొని పాఠాలు చెపుతున్న తీరు అందర్నీ అబ్బురపరుస్తోంది. వివరాల్లోకెళితే.. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని గాజులగట్టు మీదుగా వెళ్ళేవాళ్ళెవరికైనా అక్కడో అద్భుత దృశ్యం కనిపిస్తుంది. మండే ఎండల్లో.. అదికూడా వేసవి సెలవుల్లో.. చింత చెట్టుకింద పాఠాలు చెపుతున్న ఓ ఉపాధ్యాయుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

అతని పేరు వాంకుడోత్ గోపీనాథ్‌. గాజులగట్టు శివార్లలోని పాటిమీదిగూడెం పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఒక టీచరుగా విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు.. వారు నేర్చుకున్నది మర్చిపోకుండా ఉంచడం కూడా తన బాధ్యతగా భావించాడు గోపీనాథ్‌. పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో పిల్లలు నేర్చుకున్నవి మర్చిపోకుండా ఉండేందుకు ఎప్పటిలానే ప్రతిరోజూ ఆ ఊరికి వెళ్ళి పిల్లలను ఓ చెట్టునీడన కూర్చోబెట్టి పాఠాలు చెపుతూ శెభాష్‌ అనిపించుకుంటున్నాడు.

పిల్లలను చింత చెట్టునీడన కూర్చోబెట్టి పాఠాలు చెప్పడమే కాదు.. వారికి ఓ వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసి, పిల్లలు ఎండలో తిరగకుండా ఉండేందుకు తగు సూచనలు చేస్తూ.. మరో వైపు హోంవర్క్‌ ఇస్తూ.. పిల్లలు చేశారా? లేదా? అనే విషయాన్ని వాకబు చేస్తూ నిత్యం పిల్లలతో టచ్‌లో ఉంటోన్న గోపినాథ్‌పై గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక టీచరుగా గురుతర బాధ్యతలు నిర్వర్తిస్తూనే…మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు గోపీనాథ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..