
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి క్రికెటర్‌గా మారిపోయారు. బ్యాట్‌తో ఇరగదీశారు.. గల్లీ క్రికెటర్‌గా దుమ్మురేపారు. క్రికెటర్‌గా మారి కాసేపు సందడి చేశారు. క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్ అందుకుని సరదాగా సందడి చేశారు.. హిట్టింగ్ షాట్లతో సత్తా చూపించారు. తాను చినారులతో కలిసి ఆటగాడిగా మారిపోయారు. శుక్రవారం తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్తూ మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు కనిపించారు. ఇంకేం వెంటనే కారు ఆపి పిల్లలను పలకరించారు. హోదాను పక్కన పెట్టి పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయారు. వారితో కాసేపు క్రికెట్ ఆడారు.
ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడి అందరిని ఆశ్చర్యపరిచారు. స్పీకర్ స్వయంగా వచ్చి పిల్లలతో క్రికెట్ ఆడటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. క్రికెట్ ఆడి అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు.