తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది.

తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
Telangana Sec Released Schedule For Mptc Zptc Elections

Telangana mptc zptc elections: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మరో ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో ఖాళీ అయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధమైంది. వివిధ కారణాల నేపథ్యంలో నిలిచిపోయిన ఖాళీ అయిన స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఆయా చోట్ల ఓటరు జాబితా తయారీకి ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.

ఏప్రిల్ 4న ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 8వ తేదీ వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, ఏప్రిల్ 12న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 34 ఎంపీటీసీ స్థానాలు, 99 సర్పంచ్, 2,004 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు ఎస్ఈసీ తెలిపింది. 20 గ్రామ పంచాయతీల్లో అన్ని పదవులు ఖాళీగా ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. దీంతో మరోసారి రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలుకానుంది.

ఇదీ చదవండిః

 ఏపీ వైసీపీలో తీవ్ర విషాదం.. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూత

మీరు లవ్‌‌లో ఉన్నారా..! ఎలా ప్రపోజ్ చేయాలో తెలియడం లేదా..? అయితే ముందుగా మీ ప్రియురాలు గురించి ఇవి తెలుసుకోండి..