Telangana: రూ. 50 టికెట్‌తో 12 గంటలు ఉచిత ప్రయాణం.. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌.

రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులకు ఆకట్టుకుంటోంది తెలంగాణ ఆర్టీసీ. మరీ ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆర్టీసీ బస్సు ఎక్కేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 'టీ9-30' పేరుతో ప్రత్యేక టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టి9-60 అందుబాటులో ఉండగా..

Telangana: రూ. 50 టికెట్‌తో 12 గంటలు ఉచిత ప్రయాణం.. ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపరాఫర్‌.
Tsrtc T9 30

Updated on: Jul 26, 2023 | 6:10 PM

రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులకు ఆకట్టుకుంటోంది తెలంగాణ ఆర్టీసీ. మరీ ముఖ్యంగా సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆర్టీసీ బస్సు ఎక్కేలా చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘టీ9-30’ పేరుతో ప్రత్యేక టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే టి9-60 అందుబాటులో ఉండగా.. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు తాజాగా టి9-30 టికెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లోని బస్ భవన్ లో బుధవారం ‘టి9-30 టికెట్’ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ టికెట్‌ కు రూ.50 చెల్లిస్తే 30 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే వెసులుబాటును ప్రయాణికులకు కల్పించినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 27 (గురువారం) నుంచి ఈ టికెట్ అమల్లోకి వస్తుందని, పల్లె వెలుగు బస్సు కండక్టర్ల వద్ద టికెట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్‌ను ఇస్తారని అధికారులు తెలిపారు.

తక్కువ దూరం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులకు టి9-30 టికెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ టికెట్‌తో 30 కిలోమీటర్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రానూపోను ప్రయాణం చేయొచ్చు. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాలకు ఈ టికెట్ వర్తిస్తుంది. ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఆదా అవుతుంది. ఈ టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు తిరుగుప్రయాణంలో రూ.20 కాంబి టికెట్ తీసుకుని ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చు. ఒక నెల పాటు ఈ టికెట్ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ప్రయాణికుల స్పందనను బట్టి పొడగించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఇటీవల తీసుకొచ్చిన టి9-60 టికెట్‌ను పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించే వారందరికీ వర్తింపజేస్తున్నట్లు చైర్మన్, ఎండీ ప్రకటించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం తీసుకువచ్చిన ఈ టికెట్ ను.. ఈ నెల 27 (గురువారం) నుంచి పురుషులకు కూడా వర్తింపజేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు. రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించే ఈ టికెట్‌కు మంచి స్పందన వచ్చిందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..