Telangana Corona Updates: తెలంగాణలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గు ముఖం పడుతోంది. రోజు వారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 52,714 శాంపిల్స్ పరీక్షించగా.. 683 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇవాళ ఒక్క రోజు 2,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,674 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా వరకు బాధితులు ఇళ్లలోనే ట్రీట్‌మెంట్ పొందుతుండగా.. సీరియస్‌గా ఉన్న కొందరు మాత్రమే ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.52 శాతం ఉండగా, రికవరీ రేటు 97.73 శాతంగా ఉంది.
ఇదిలాఉంటే, ఇవాళ తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,83,019 మంది కరోనా బారిన పడగా.. వీరిలో 7,65,239 కోలుకున్నారు. ఇప్పటి రాష్ట్రంలో కరోనా ప్రభావంతో 4,106 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 168 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో వ్యాక్సీనేషన్ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సెంటర్లలో ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి మొత్తం 5,65,38,208 వ్యాక్సీన్ డోసులు వేశారు.
Also read: