Minister KTR: పిల్ల ఖాయమే కాలేదు కానీ.. లగ్నం డేట్ ఫిక్స్ చేసినట్లు ఉంది.. మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
Telangana Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది.. అధికార పార్టీ బీఆర్ఎస్.. సహా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. అన్నట్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో 18 రోజులు ఉండటంతో.. పండుగ తర్వాత ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం కసరత్తులను కూడా సిద్ధం చేసుకున్నాయి.
Telangana Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది.. అధికార పార్టీ బీఆర్ఎస్.. సహా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. నిన్నటి వరకు ఓ లెక్క.. ఇప్పటినుంచి మరో లెక్క.. అన్నట్లు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో 18 రోజులు ఉండటంతో.. పండుగ తర్వాత ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నాయి. దీనికోసం కసరత్తులను కూడా సిద్ధం చేసుకున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం జరిగే ఈ 15 రోజుల్లో కొత్త కుట్రలకు ప్రత్యర్థులు తెరలేపుతారంటూ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో వందతులు సృష్టిస్తూ.. కాంగ్రెస్, బీజేపీలు ప్రజల ఆలోచనలు మారేలా చేస్తారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త కుట్రలకు తెరలేపుతాయని.. బీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తాయని.. 15 రోజులపాటు ఇవే కుట్రలు చేస్తూ ఆలోచనలు మారేలా చేస్తారంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పెద్దలు సృష్టించే వదంతులపై నిఘా ఉంచాలన్నారు.
డిసెంబర్ 3 తర్వాత తామే సీఎం అంటూ కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు మంత్రి కేటీఆర్. పిల్ల ఖాయమే కాలేదు కానీ.. లగ్నం డేట్ ఫిక్స్ చేసినట్లు కాంగ్రెస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున గెలిస్తే ఆరేడుగురు మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని కేటీఆర్ చురకలంటించారు.
బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి..
ఇదిలాఉంటే.. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కండువా కప్పి స్రవంతిని పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్.. మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి ఎందుకు పార్టీలు మారారో అర్థం కావడం లేదన్నారు. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదంటూ విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి