Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay Arrest: పేపర్ లీక్ వ్యవహారంలో అదే కీలకం.. బండి కేసులో మిస్సింగ్‌ ఏంటో తెలుసా..?

తెలంగాణలో టెన్త్‌ క్లాస్ క్వశ్చన్ పేపర్‌ లీకుల ఉదంతంలో ముఖ్యమైనది.. ఇప్పటి వరకు పోలీసుల చేతికి చిక్కనిదీ ఒకటుంది. అది దొరికితే మరింత రచ్చరచ్చ అవ్వడం ఖాయం..దీనికోసం పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ అదేంటో లుక్కెయండి..

Bandi Sanjay Arrest: పేపర్ లీక్ వ్యవహారంలో అదే కీలకం.. బండి కేసులో మిస్సింగ్‌ ఏంటో తెలుసా..?
Bandi Sanjay
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 06, 2023 | 7:26 AM

తెలంగాణలో రెండు రోజులుగా టెన్త్ పేపర్ లీక్‌ ఇష్యూ నడుస్తోంది.. ఈ కేసులో బండి సంజయ్‌ అరెస్టయ్యారు. రిమాండుకూ పంపించారు. అయినా కేసులో ఇంకేదో మిస్సయ్యింది. ఏ ఏదో ఏంటో కాదు.. ఇదే..బండి సంజయ్‌ ఫోన్.. బండి సంజయ్ ఫోన్‌ చుట్టూ లీకేజీ దుమారం.. ఫోన్ అడిగితే బండి ఇవ్వడంలేదని సీపీ రంగనాథే చెబుతున్నారు. ఫోన్‌ ఇస్తే ఏంటి.. బండి సంజయ్‌ ఫోన్‌లో అసలు కంటే కొసరు మేటరే ఎక్కువుందా.. ఆయన ఫోన్‌ దొరికితే మొత్తం సినిమా ఐమాక్స్‌ లో కనిపిస్తుందా..? అసలు బండి సంజయ్‌ ఫోన్‌ ఎందుకు దాస్తున్నారు.. నిర్దోషి అయితే ఫోన్‌ దాయాల్సిన అవసరం ఏంటి?.. ఫోన్‌ తెస్తే సగం ప్రశ్నలకు సమాధానాలు దొరికేవని వరంగల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ చెబుతున్నారు.

సంజయ్‌ ఒక్కసారి ఫోనిస్తే..చాలా విషయాలు వెలుగు చూస్తాయి. ఫోన్‌కు ఎలాంటి సమాచారం వచ్చిందో.. ఎవరెవరికి ఫోన్లు చేశారో..ఎన్నిసార్లు ఫోన్‌ చేశారో తమకు తెలుసంటున్నారు. అయితే, బండి ఫోన్‌లో వాట్సప్‌ చాట్‌, కాల్స్‌ను రికవరీ చేస్తామంటున్నారు పోలీసులు.. పేపర్‌ లీకేజీ అంతా ఓ గేమ్‌ప్లాన్‌లా భావించి, నడిపిస్తున్నారోనని సీపీ రంగనాథ్‌ చెప్పారు.

మొత్తానికి మేటర్‌ అంతా ఫోన్‌ చుట్టూ తిరుగుతోంది. ఒక్క ఫోన్ వెయ్యి ప్రశ్నలకు సమాధానం అన్నట్లు.. ఇప్పుడు అందరి దృష్టీ ఫోన్‌మీదే పడింది. ఫోన్ దొరుకుతుందా..? దొరికితే.. ఎలాంటి సమాచారం బయటకు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. బండి సంజయ్ సహా.. పేపర్ లీక్ కేసు నిందితులను కరీంనగర్ జైలుకు తరలించారు. ఇవాళ బండి సంజయ్ బెయిల్ పై విచారణ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
మహిళలదే అగ్రస్థానం.. గ్రూప్ -1 జనరల్ ర్యాంకింగ్స్ విడుదల
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై పీల్ కొట్టేసిన న్యాయస్థానం..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
దేశసేవకు స్మృతి మందిర్ ప్రేరణ.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..
మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్
మీ ఇంట్లో గ్యాస్ స్టౌ మంట ఏ రంగులో ఉందో గమనించారా? డేంజర్ అలర్ట్
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
పేదరిక నిర్మూలనే జీవిత లక్ష్యం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ట్రంప్ దెబ్బకు.. అమెరికన్లకు చెప్పుకోలేని కష్టం..
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
ప్రధాని మోదీ మన్​ కీ బాత్​లో ఆదిలాబాద్ ఇప్పపువ్వు లడ్డూ ప్రస్తావన
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి శోభాశెట్టి పూజలు.. కారణమిదేనట
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..
మీ గోల్డ్‌ నగలు ఇతరులకు ధరించేందుకు ఇస్తున్నారా? ఓ క్షణం ఆగండి..
నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి..
నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతార సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి..