Telangana: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్‌న్యూస్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం పెంపు

పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్‌న్యూస్.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం పెంపు
Panchayat Raj And Local Bodies Honorary Salaries
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2021 | 6:20 PM

Telangana Government: తెలంగాణ ప్రజా ప్రతినిధులక శుభవార్త.. ఇంతకాలం అరకొర గౌరవ వేతనాలతో సతమతమవుతున్నవారికి ఉపశమనం కలగనుంది. పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 30 శాతం గౌరవ వేతనాలు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి రూ.13 వేలకు పెంచింది. ఎంపీటీసీ, సర్పంచుల గౌరవ వేతనం రూ. 5వేల నుంచి రూ.6,500కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

మరోసారి స్థానిక పంచాయితీ ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదలైంది. వేతనాల పెంపుకు సంబంధించి మంత్రి హరీష్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వేతనాల పెంపు ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్దిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు.. ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముప్పై శాతం మేర గౌరవ వేతనం పెంచడం ప్రభుత్వ చిత్త శుద్దికి నిదర్శనం అన్నారు.

కాగా గౌరవ వేతనం పెరిగిన వారిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటిసీలతోపాటు ఎంపీపీలు ఉన్నారు. వీరికి గతంలో ఉన్న వేతనం కంటే 30 శాతం అదనంగా గౌరవ వేతనం పెంచారు. ప్రస్తుతం సర్పంచ్‌‌లు ఎంపీటీసీలకు ప్రతి నెల రూ.5,000 ఉన్న వేతనం.. ఇక నుండి రూ.6,500 ఇవ్వనున్నారు. జెడ్పీటీసిలతోపాటు మండలాధ్యక్షులకు ప్రస్తుతం రూ.10వేలు ఉండగా, ఇక నుంచి రూ.13,000 పెరిగింది. పెరిగిన వేతనాలు జూలై నెల నుండే అమల్లోకి రానున్నాయి.

Read Also… Happy Birthday Puri Jagannadh: గోవాలో పూరి జగన్నాథ్ బర్త్‌డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

Kanhaiya Kumar: గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి కన్హయ్య కుమార్.. రాహుల్ గాంధీ సమక్షంలో చేరిక