Telangana News: పదేళ్ళుగా ఎవరు పట్టించుకోకపోవడంతో, పది మంది యువకులు చేసి చూపించారు. ఎం పి కవిత చేత ప్రశంసలు పొందారు. పది మందికీ ఉపయోగపడేలా, మంచి పనులు చేసి భోగి పండుగ జరుపుకున్న సంఘటన మహబూబబాద్ జిల్లా కొత్తగూడలో చోటుచేసుకుంది.
కొత్తగూడ మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనీ గాదె వాగు ఇది. వరంగల్ – కొత్తగూడ ప్రధాన రహదారి ఇది. గత పది సంవత్సరాలుగా ప్రయాణికులకు గాదె వాగు నరకం చూపిస్తున్నా. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షం పడిన ప్రతీసారి వాగు పొంగి, ప్రయాణికులు ఇబ్బందిపడేవారు. దీంతో రహదారి నరకంగా మారింది. మేడారం వెళ్లాలన్నా ఖమ్మం జిల్లా నుండి మేడారం వెళ్లేందుకు.. ఇదే రహదారీ కావడంతో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. వర్షం పడినపుడు గాదె వాగు దాటాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దాటుతున్నారు.
ప్రయాణికుల కష్టాలను గుర్తించి కొంతమంది యువకులు గాదె వాగు పై పడ్డ రంధ్రాలకు మరమ్మతులు చేసారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసారు. కొత్తగూడ, గాంధీనగర్, గుంజేడు గ్రామాలకు చెందిన యువకులు అజ్మీర రాజన్న, పాకాల స్వామి యువకుల బృందం కష్టపడి మరమ్మతులు చేశారు. పండుగనాడు మంచి పని చేసి, పది మందికీ ఉపయోగపడేలా చేసి పలువురి చేత శభాష్ అనిపించుకున్నారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపి మాలోతు కవిత యువకులను అభినందించారు.
Also read:
ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
Telangana News: ఏడుగురు సభ్యుల దొంగల ముఠా.. చేసేవన్నీ అలాంటి చోరీలే.. షాకింగ్ వివరాలు మీకోసం..!