Telangana Inter Exams: పరీక్ష రాస్తుండగానే.. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు పరీక్ష రాస్తున్న సమయంలో ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు వచ్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో..

Telangana Inter Exams: పరీక్ష రాస్తుండగానే.. తెలంగాణలో ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు..
Heart Attack To Inter Student

Updated on: Mar 23, 2023 | 4:55 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం (మార్చి 23) పరీక్ష రాస్తున్న సమయంలో ఇంటర్ విద్యార్థినికి గుండెపోటు వచ్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షరాస్తున్న సమయంలో బిందు అనే ఇంటర్‌ విద్యార్ధిని అస్వస్థతకు గురైంది. దీంతో సదరు పరీక్ష కేంద్రంలోని పీఆర్డీవో వెంకటేశ్వర్లు 108కు ఫోన్ చేశారు. పరీక్ష కేంద్రానికి చేరుకున్న 108 సిబ్బంది సీపీఆర్ చేసి విద్యార్థిని ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా అన్నివయసుల వారికి గుండెపోటు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంటర్‌ విద్యార్ధినికి గుండెపోటు రావడం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.