MLA Jaggareddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడిపై మంత్రి నాని మాట్లాడిన మాటలు సరికాదని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు ఏపీలో ఇలాంటి దూషణాలు చూడలేదని, చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం చాలా మంది నాయకులకు ఇబ్బందిగానే అనిపిచిందని వ్యాఖ్యానించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని అన్‌ఫిట్ అంటూ వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బాబు తిట్టేటప్పుడు.. జగన్ నవ్వు దేనికి సంకేతమని ప్రశ్నించారు. అయితే రాష్ట్రంలో రాజకీయంగా టార్గెట్ చేశారనే కాదు.. ఫ్యామిలిని తిట్టారనే చంద్రబాబు ఏడ్చారని అన్నారు. ఏడుపు అపుకొనే ప్రయత్నం చేసినా.. ఆగలేదని, కుటుంబ సభ్యుల పై విమర్శలు వస్తే.. ఎవరు కంట్రోల్ చేసుకోలేరని పేర్కొన్నారు.
ఏపీతో నాక్కూడా అనుబంధం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నానని అన్నారు. మంత్రి అనిల్ అయితే కుస్తీ కి దిగినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబునీ అలా తిట్టడం నాకు బాధ అనిపించింది. జగన్ ఇప్పటికైనా.. చొరవ తీసుకోవాలి.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు నాని ఎక్కడ ఉన్నాడు అంటూ ప్రశ్నించారు. కౌరవ సభలో ద్రౌపదికి జరిగిన అన్యాయమే బాబుకు జరిగింది. బీజేపీ కూడా వ్యక్తి గత దూషణల రాజకీయం మొదలుపెట్టిందని జగ్గారెడ్డి ఆరోపించారు.
ఇవి కూడా చదవండి: