KTR: కీలక డిమాండ్‌ను లేవనెత్తిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోడీని కోరుతూ ట్వీట్

ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్రం, తెలంగాణ సర్కారు మధ్య వార్ ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే మరో కీలక అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్ టార్గెట్ చేశారు.

KTR: కీలక డిమాండ్‌ను లేవనెత్తిన మంత్రి కేటీఆర్.. ప్రధాని మోడీని కోరుతూ ట్వీట్
Telangana Minister KTR
Follow us

|

Updated on: Dec 03, 2021 | 7:25 PM

ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్రం, తెలంగాణ సర్కారు మధ్య వార్ ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో కీలక డిమాండ్‌ను లేవనెత్తిన మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ మేరకు ప్రధాని మోడీని కోరుతూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తులు చేశారని గుర్తుచేశారు. అయితే కేంద్రం వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. అదే సమయంలో ఏపిలోని పోలవరం, కర్ణాటక లోని అప్పర్ భద్ర ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా కేంద్రం గుర్తించిందన్నారు.

ఈ నెల 6వ తేదీన మీరు జరపబోయే హైపర్ పవర్ స్టీరింగ్ కమిటీ మీటింగ్ లో తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్న వినతులను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు.

తెలంగాణలోని కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్.. 

Also Read..

Coronavirus: కళాశాలలో కరోనా కలకలం.. 56 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌..!

Viral Video: నాగుపాము దాహం తీర్చిన యువకుడు !! వీడియో వైరల్‌