Munugode Bypoll: టార్గెట్ ప్రధాని నరేంద్ర మోదీ.. సెన్సేషన్ కామెంట్స్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్..
అనుకున్నదే జరిగింది. చండూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

అనుకున్నదే జరిగింది. చండూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అధికారం అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. సభకు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకువచ్చిన గులాబీ దళపతి కేసీఆర్.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఫైర్ అయ్యారు. ‘నరేంద్ర మోదీ ఇంకా ఏం కావాలి నీకు. దేశంలో అత్యంత కీలకమైన పదవి ప్రధాని. ఆ పదవిలో ఉండి కూడా ఎందుకు ఈ కిరాతకం. ఎందుకు ఈ దుర్మార్గం. సమాజానికి ఏ రకంగా మంచిది. దేనికోసం చేస్తున్నారంత ఇదంతా. ప్రధాని కంటే మంచి పదవి ఉందా? నరేంద్ర మోదీ మద్ధతు లేకుండానే ఆర్ఎస్ఎస్ ప్రముఖులు హైదరాబాద్ వచ్చారా? చంచల్ గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆ నిందితులకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ అరాచకానికి కారణమైన వారు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలి.’ అని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.
ఈ నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు. ఇలాంటి రాజకీయ నాయకులు కదా మనకు కావాల్సింది. ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారు. వందల కోట్ల రూపాయల అక్రమ ధనం తీసుకువచ్చి ప్రజా ప్రతినిధులను సంతలో పశువుల్లా కొని, ప్రభుత్వాలను కూలగొట్టే అరాచక వ్యవస్థను తీసుకువచ్చారు. వంద కోట్లు ఇస్తాం.. పార్టీని విడిచి రమ్మంటే వారిని ఎడమకాలితో చెప్పుతో కొట్టినంత పని చేశారు మన ఎమ్మెల్యేలు. మేం తెలంగాణ బిడ్డలం అని, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల అంత ఎత్తుకు ఎగురవేశారు. తెలంగాణ జాతి గౌరవాన్ని, దేశ గౌరవాన్ని కాపాడారు. దేశంలో చైతన్యం రానంత వరకు దుర్మార్గపు రాజకీయాలు కొనాసాగుతూనే ఉంటాయి. మాయమాటలు నమ్మితే మన బతుకులు ఇలాగే ఉంటాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రసంగం లైవ్ వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
