Harish Rao: బీఆర్ఎస్ హ్యాట్రిక్‌నీ ఎవ్వరూ అడ్డుకోలేరు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌నీ ఎవ్వరూ అడ్డుకోలేరని.. కాంగ్రెస్, బీజేపీవి పగటి కలలంటూ విమర్శించారు.

Harish Rao: బీఆర్ఎస్ హ్యాట్రిక్‌నీ ఎవ్వరూ అడ్డుకోలేరు.. మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao

Updated on: May 29, 2023 | 8:00 AM

తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందంటూ మంత్రి హారీష్ రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌నీ ఎవ్వరూ అడ్డుకోలేరని.. కాంగ్రెస్, బీజేపీవి పగటి కలలంటూ విమర్శించారు. కరుడుగట్టిన ఉద్యమకారులున్న జిల్లా.. నిజామాబాద్‌ అంటూ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే సీఎం ఎల్లారెడ్డికి మరిన్ని వరాల ఝల్లు కురిపిస్తారని వెల్లడించారు. ఆదివారం ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్‌, బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణలో అధికారం వారి.. పగటి కలలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ పనితీరు బాగుంది కనుకనే యావత్‌ దేశం తెలంగాణవైపు చూస్తోందన్నారు. ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మంత్రి తెలంగాణ కన్నా బాగా పనిచేసే ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు.

తెలంగాణలో 24 గంటలు కరెంటిస్తే అది చమత్కారమేనన్న నాటి కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను గుర్తుచేశారు హరీష్‌రావు. కాంగ్రెస్‌ పాలన మైగ్రేషన్‌ అయితే.. బీఆర్‌ఎస్‌ పాలనంతా ఇరిగేషన్‌ అన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుందన్నది నేటి వాస్తవం అన్నారు మంత్రి హరీష్‌రావు. ఈ విషయాలను

ఎల్లారెడ్డిలో సురేందర్‌ గెలుపునీ, బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌నీ ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు మంత్రి హరీష్‌రావు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరి, గులాబీ కండువా కప్పుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..