Telangana: క్షణికావేశంలో భార్యభర్తల బలవన్మరణం.. అనాథగా మిగిలిన ఏడు నెలల చిన్నారి

ఆలుమగల మధ్య మనస్పర్ధలు రావడం సహజమే. గొడవ తర్వాత బంధం మరింత బలపడుతుంది. ఐతే ఓ జంట క్షణికావేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం.. అల్లరు ముద్దుగా పెరగవల్సిన తమ ఏడు నెలల చిన్నారిని అనాథగా మిగిల్చారు. భర్తపై..

Telangana: క్షణికావేశంలో భార్యభర్తల బలవన్మరణం.. అనాథగా మిగిలిన ఏడు నెలల చిన్నారి
Latha, Ranganayakulu

Updated on: May 29, 2023 | 7:15 AM

ఆలుమగల మధ్య మనస్పర్ధలు రావడం సహజమే. గొడవ తర్వాత బంధం మరింత బలపడుతుంది. ఐతే ఓ జంట క్షణికావేశంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం.. అల్లరు ముద్దుగా పెరగవల్సిన తమ ఏడు నెలల చిన్నారిని అనాథగా మిగిల్చారు. భర్తపై కోపంతో భార్య ఆత్మహత్య చేసుకుంటే.. భార్య మరణించిందనే మనస్తాపంతో భర్త కూడా తనువు చాలించాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెల్పిన వివరాల ప్రకారం..

దేవనకొండ మండలం గుడమిర్ల గ్రామనికి చెందిన అడ్డాకుల రంగనాయకులు (28) ఆర్‌ఎంపీ డాక్టర్‌. రెండేళ్ల క్రితం పత్తికొండ మండలం చిన్నహుల్తికి చెందిన లత(25)తో వివాహం జరిగింది. ఈ జంటకు ఏడునెలల కుమారుడు ఉన్నాడు. పొలానికి వెళ్లే విషయంలో భార్యాభర్తలిద్దరూ శనివారం వాదులాడుకున్నారు. ఈ నేపథ్యంలో క్షణికావేశానికి గురైన లత పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది.

లత మృతితో మనస్తాపం చెందిన రంగనాయకులు మరుసటి రోజే (ఆదివారం) ఉదయం కర్నూలులోని కోట్ల రైల్వేస్టేషన్‌ పరిధిలో పట్టాలపై శవమై తేలాడు. పట్టాలపై రంగనాయకులు తల, మొండెం వేరుగా పడి ఉండటాన్ని చూసిన ఓ రైల్వే పోలీస్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షణికావేశంలో దంపతుల బలవన్మరణం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి ఆక్రందన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.