AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దృశ్యం సీన్‌ రిపీట్‌! ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు

ప్రియురాలిని నమ్మకంగా తనతోపాటు తీసుకెళ్లి మూడో కంటికి తెలియకుండా హతమార్చాడో కిరాతకుడు. అదీ అత్యంత దారుణంగా. తొలుత హత్య చేసి, మృత దేహాన్ని ముక్కలు చేశాడు. అనక వాటిని ఓ గోనె సంచిలో వేసి మూటకట్టి.. నేరుగా సమీపంలోని తన పత్తి చేనుకు వెళ్లాడు. అక్కడ గుంట తీసి పాతిపెట్టి ఏమీ ఎరగనట్లు ఇంటికి వచ్చాడు.. కానీ అంతలోనే

Telangana: దృశ్యం సీన్‌ రిపీట్‌! ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
Kothagudem Woman Murder Case
Follow us
N Narayana Rao

| Edited By: Srilakshmi C

Updated on: Nov 13, 2024 | 5:38 PM

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్‌ 13: ఓ మహిళ మిస్సింగ్‌ కేసు కాస్త విషాదాంతం అయ్యింది. గత కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ ముక్కలై గోనె సంచి పత్తి చేనులో లభ్యమైంది. ప్రియుడే ఆమెను హతమార్చి పొలంలో పాతిపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ షాకింగ్‌ ఘటన భద్రాద్రి జిల్లాలోని మాచినేనిపేట తండాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. జూలూరుపాడు మండలం మాచినేనిపేటకు చెందిన వీరభద్రం, స్వాతి (32) ప్రేమికులు. వీరు గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే వీరభద్రానికి ఇది వరకే వివాహం జరిగింది. తన భర్త వేరే మహిళతో చనువుగా ఉండటం గమనించిన వీరభద్రం భార్య.. స్వాతితో పలుమార్లు గొడవ పడింది. ఇందుకు సంబంధించి చుంచుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో స్వాతిపై కేసు కూడా నమోదైంది. విచారణలో భాగంగా స్వాతి కోసం పోలీసులు ఆరా తీయగా.. ఆమె గత 3 రోజులుగా కనిపించడం లేదనే విషయం వెలుగులోకి వచ్చింది. కనబడకుండా పోయిన స్వాతి తల్లిదండ్రులు కూడా మిస్సింగ్‌ కేసు పెట్టారు.

ఈ క్రమంలో వీరభద్రంను విచారించిన జూలూరుపాడు పోలీసులు.. అతని వాలకంపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయం చెప్పాడు. స్వాతిని తానే హతమార్చానని, ఆమెను చంపి పాతిపెట్టిన గోనె సంచిని తవ్వి తీసి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు ఈ గోనె సంచిని ఓపెన్‌ చేసి చూడగా.. అదులో యువతి శరీర భాగాలు ముక్కలుగా ఉండటం చూసి హతాసులయ్యారు.

గతంలో జూలూరుపాడు మండలానికి చెందిన ఓ జంటకు సింగరేణిలో ఉద్యోగాలిప్పిస్తామని స్వాతి నమ్మబలికి, వారి నుంచి రూ.16 లక్షల దాకా వసూలు చేసింది. ఆ డబ్బు మొత్తం వీరభద్రం చేతికి అప్పగించింది. అయితే తాము మోసపోయామని గ్రహించిన ఆ జంట పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో.. ఆ డబ్బు విషయమై వీరభద్రం, స్వాతి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. మొత్తం తానే అనుభవించాలనే ఉద్దేశంతో ఈ నెల 9వ తేదీన తన ఇంట్లోనే స్వాతిని దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి, గోనె సంచిలో వేసి, సమీపంలోని తన పత్తి పొలంలో పాతిపెట్టాడు. వీరభద్రం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.