Telangana: హుండీలో రక్తంలో రాసిన లేఖ.. దేవుడికి ఆ భక్తుడు ఏమని మొర పెట్టుకున్నాడంటే..?
తన ప్రేమను గెలిపించమని ఆ వ్యక్తి దేవుడ్ని కోరాడు. మాములుగా మొక్కితే దేవుడు వినడు అనుకున్నాడో ఏమో.. ఏకంగా రక్తంతో లేఖ రాశాడు.
ఎవరైనా ప్రేమలో పడితే.. ఆమె తనకు దక్కాలని గుడికి వెళ్లి మొక్కుకోవడం కామన్. కొందరు తలనీలాలు ఇస్తారు. మరికొందరు ముడుపులు చెల్లించుకుంటారు. గుడి చుట్టూ 1000 ప్రదక్షణలు చేస్తారు. ఇంకొందరు అన్నదానం చేస్తారు. హుండీలో కానుకలు గట్రా వేస్తారు. కానీ ఫర్ ఏ ఛేంజ్ నల్గొండ జిల్లాలో ఓ యువకుడు తన ప్రేమను గెలిపించమని ఏకంగా దేవుడికే ఉత్తరం రాశాడు. అది కూడా మాములుగా కాదండోయ్.. రక్తంతో. తామిద్దరం జీవతాంతం కలిసి ఉండేలా దీవించాలంటూ బ్లెడ్‌తో లేఖ రాసి హుండీలో వేశాడు. తాజాగా కానుకలు లెక్కించేందుకు హుండీ ఓపెన్ చేయగా.. లేఖ చూసి అధికారులు, అర్చకులు షాకయ్యారు.
నల్గొండ జిల్లా పెద్దగట్టు దురాజపల్లి జాతర ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి లింగమంతులస్వామిని స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏటా ఐదు రోజుల ఈ జాతర జరుగుతుంది. తాజాగా ఓ భక్తుడు స్వాములోరి హుండీలో తన ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు తీసుకెళ్లాలని రక్తంతో రాశాడు. శ్రీకాంత్ అనే యువకుడి పేరుతో ఆ లేఖ ఉంది. మంగమ్మ అనే యువతి గురించి ఇలా రాసుకొచ్చాడు.
గతంలో కూడా ఓ భక్తుడు ఇలానే ఓ విచిత్రమైన లేఖ రాశాడు. తన దగ్గర బిజినెస్‌లో భాగంగా డబ్బులు తీసుకున్న వ్యక్తులు.. రిటన్ ఇవ్వడం లేదని.. వారికి కఠిన శిక్ష వేయాలంటూ వేసిన లేఖ కూడా గతంలో వైరల్ అయ్యింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం