Telangana: విద్యుత్ వినియోగంలో రికార్డు.. రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధికం..
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగిన రోజుగా రికార్డు సృష్టించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 14,169 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు...
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం జరిగిన రోజుగా రికార్డు సృష్టించింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు 14,169 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదైనట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే రోజున గరిష్ఠ డిమాండ్ 11,876 మెగా వాట్లు మాత్రమే కాగా.. ఇప్పుడు 14 వేలకు పైగా విద్యుత్ వినియోగం పెరగడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు ఇదే కావడం గమనార్హం. వేసవి కాలం ప్రారంభంలోనే తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
రాష్ట్రంలో ఇదే అత్యధిక వాడకమని.. రాబోయే రోజుల్లో డిమాండ్ మరింత పెరగొచ్చని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంటు వినియోగం పెరగడంతో పాటు యాసంగి పంటకు మోటార్ల ద్వారా నీరు అందిస్తుండటంతో డిమాండ్ ఎక్కువైందని అధికారులు తెలిపారు. కాగా.. తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. గతేడాది మార్చిలో 14,160 మెగావాట్ల విద్యుత్తు వినియోగం జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం