Hyderabad: ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ప్రారంభం.. హాజరైన కేంద్ర మంత్రి అమిత్‌ షా

శాంతి భద్రతలను కాపాడటంలో.. నేరాలను అరికట్టడంలో ఐపీఎస్‌ల పాత్ర ఎంతో కీలకం. తమ కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సేవలందిస్తూ ఉంటారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొంత మంది అధికారులు ఫీల్డ్‌లోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

Hyderabad:  ఐపీఎస్‌ల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ ప్రారంభం.. హాజరైన కేంద్ర మంత్రి  అమిత్‌ షా
Amit Shah
Follow us
Basha Shek

|

Updated on: Feb 11, 2023 | 8:11 AM

శాంతి భద్రతలను కాపాడటంలో.. నేరాలను అరికట్టడంలో ఐపీఎస్‌ల పాత్ర ఎంతో కీలకం. తమ కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సేవలందిస్తూ ఉంటారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కొంత మంది అధికారులు ఫీల్డ్‌లోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 11) 7:50 నుంచి 10: 30 వరకు ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ జరగనుంది. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో 74వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన ఐపీఎస్‌లకు కేంద్ర మంత్రి అమిత్ షా ట్రోఫీలు అందజేయనున్నారు.  ఈ కార్యక్రమం కోసం అమిత్‌షా నిన్న రాత్రే ఆయన నగరానికి చేరుకున్నారు. ఐపీఎస్‌ల పరేడ్‌ అనంతరం 11 నుంచి 12 గంటల వరకు అధికారులతో అమిత్ షా భేటీ అవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటా 20నిముషాలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరుతారు అమిత్ షా. కాగా 74వ బ్యాచ్‌లో 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు 17 సబ్జెక్టుల్లో ట్రైనింగ్ పొందారు.

సైబర్ నేరాలపై స్పెషల్‌ ట్రైనింగ్‌..

వీరిలో 166 మంది భారతీయులు కాగా, 29 మంది విదేశీ అధికారులు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. కాగా ఈ బ్యాచ్‌లో ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించినట్టు తెలంగాణ క్యాడర్‌కు అకాడమీ డైరెక్టర్ రాజన్‌ వివరించారు. కోవిడ్ తర్వాత భారీ స్థాయిలో పాసింగ్ పరేడ్ నిర్వహిస్తున్నారు అధికారులు. 2021 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్లు త్వరలోనే కొత్త రోల్స్‌లో కనిపించబోతున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలకు అనుగుణంగా వీళ్లను ట్రైన్ చేశారు. టెక్నాలజీని ఉపయోగించి సైబర్ భూతాన్ని అణచివేసే దిశగా ఈ టీమ్‌కు శిక్షణ ఇచ్చారు. కాగా యువ ఐపీఎస్‌ల ట్రైనింగ్‌ సమర్థవంతంగా పూర్తి చేసుకున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలతో పాటు ప్రాపర్టీ కేసులు, సైబర్ నేరాలు, కోర్టు కేసుల ట్రయిల్స్, టెక్నికల్, ఫైనాన్షియల్ క్రైమ్స్‌కు సంబంధించిన కేసులు డీల్ చేయడంలో పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయ్యారీ ఐపీఎస్‌లు. ఇక ఫీల్డ్‌లోకి దిగడానికి సిద్ధమయ్యారు. అంతేకాదు ఫీల్డ్‌లో ఉండే సవాళ్లకు రెడీ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ