Telangana: సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ.. బస్సు ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేసిన జగిత్యాల ఎస్ఐ అనిల్..

|

May 10, 2023 | 8:56 PM

ఆడవారి మధ్య జరిగిన పంచాయితీలో తలదూర్చి ఓవర్ యాక్షన్ చేశాడు ఓ ఎస్ఐ. సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన పంచాయితీలో తలదూర్చి రచ్చ చేశాడు. అధికారమదంతో.. ఓ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి..

Telangana: సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ.. బస్సు ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేసిన జగిత్యాల ఎస్ఐ అనిల్..
Jagtial Urban Si
Follow us on

ఆడవారి మధ్య జరిగిన పంచాయితీలో తలదూర్చి ఓవర్ యాక్షన్ చేశాడు ఓ ఎస్ఐ. సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య జరిగిన పంచాయితీలో తలదూర్చి రచ్చ చేశాడు. అధికారమదంతో.. ఓ యువతి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిపోయి.. మహిళ అని కూడా చూడకుండా రాక్షసంగా ప్రవర్తించాడు. బస్సును కారుతో ఛేజ్ చేసి మరీ ఓవరాక్షన్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఓ ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఆడవాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ పెట్టుకున్న మహిళల్లో ఒకరు ఎస్సై భార్య కాగా, మరొకరు యువతి. అయితే, ఈ గొడవ విషయాన్ని మహిళ తన భర్తకు ఫోన్ చేసింది. దాంతో తనను తాను హీరోలా భావించాడో ఏమో గానీ.. తన కారులో వచ్చి బస్సును ఛేజ్ చేశాడు. ఆపై బస్సులోకి ఎక్కి ఓవరాక్షన్‌ చేశాడు.

బస్సు జగిత్యాల పట్టణంలోని బస్సు డిపో దగ్గరికి చేరుకోగానే కారుతో అడ్డగించి సివిల్ డ్రెస్సులో ఏస్సై అనిల్ బస్సు ఆపాడు. తన భార్యతో.. ఎవరు నీతో గొడవ పెట్టుకున్నారని అసభ్యంగా మాట్లాడాడు. ఏం జరిగిందో తెలుసుకోకుండా బసులోనే యువతిపై దురుసుగా ప్రవర్తించాడు. దీంతో జగిత్యాల అర్బన్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అనిల్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై అనిల్ దురుసు ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు బస్సులో ఎస్సై అనిల్‌ చేసిన ఓవరాక్షన్‌పై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్‌ అయ్యారు. ఎస్సై అనిల్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు అసదుద్దీన్‌ ఓవైసీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..