Telangana: కంపెనీల కష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? ఆయిల్ కంపెనీలకు ప్యాకేజీపై మంత్రి కేటీఆర్ ఫైర్..

కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. మరింత దూకుడు పెంచారు. తాజాగా చమురు కంపెనీలకు కేంద్రం ఆర్థిక సాయం..

Telangana: కంపెనీల కష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా? ఆయిల్ కంపెనీలకు ప్యాకేజీపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Minister Ktr
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 14, 2022 | 11:33 AM

కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. మరింత దూకుడు పెంచారు. తాజాగా చమురు కంపెనీలకు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించడంపై పైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ అయ్యిందన్నారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం.. కంపెనీలకు మాత్రం ప్యాకేజీలు ఎత్తిపోస్తోందని దుయ్యబట్టారు. ఈ మేరకు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. కేంద్రం తీరుపై దుమ్మెత్తిపోశారు.

నాడు రూ. 400 ఉన్న సిలిండర్ ధర బీజేపీ పాలనలో రూ. 1100(NOT-OUT) చేరిందని, ఇంకా పెరుగుతూనే ఉందని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ఆయిల్ కంపెనీలకు దోచిపెట్టడం కాదు.. ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు మంత్రి. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేస్తూ.. ఆడబిడ్డలపై ఆర్థిక భారం మోపుతారా? అని కేంద్రాన్ని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని విమర్శించారు. అదే సమయంలో ఆదాయం పాతాళంలో ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాసుల పంట పండిస్తూ.. కామన్ మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట పుట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని నరేంద్ర మోదీకి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప.. ఆడబిడ్డల కష్టాలు కనిపించడం లేదా? అని విమర్శించారు మంత్రి కేటీఆర్. గరీబోళ్ల గుండెలపై మోయలేని గుదిబండలు ఈ గ్యాస్ బండలు అని వ్యాఖ్యానించారు. గ్యాస్ ధర వెయ్యి అయ్యిందని, పేదలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యిందన్నారు. పేదోడి పొట్టగొట్టడం, మళ్లీ వారి చేతిలో పొగగొట్టం పెట్టడమే బీజేపీ లక్ష్యం అని విమర్శించారు కేటీఆర్. సిలిండర్ ధరను మూడింతలు పెంచి.. ఇప్పుడు 3 సిలిండర్ల జపం చేస్తారా? అని కేంద్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. మూడు సిలిండర్లతో మూడు పూటలా వంట సాధ్యమా? అని ప్రశ్నించారు. ‘మోయలేని భారం మోపే వాడే మోడీ’ అని మహిళా లోకానికి అర్థమైందని మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలతో ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..