AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మునుగోడు ఇప్పుడే గుర్తొచ్చిందా? మంత్రి కేటీఆర్ ప్రకటనపై రాజగోపాల్ రెడ్డి ఫైర్..

మునుగోడులో ఉప సమరం పీక్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నామినేషన్లు, ప్రచారాలు, సభలతో మునుగోడులో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

Munugode Bypoll: మునుగోడు ఇప్పుడే గుర్తొచ్చిందా? మంత్రి కేటీఆర్ ప్రకటనపై రాజగోపాల్ రెడ్డి ఫైర్..
Komatireddy Raj Gopal Reddy
Shiva Prajapati
|

Updated on: Oct 14, 2022 | 10:53 AM

Share

మునుగోడులో ఉప సమరం పీక్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నామినేషన్లు, ప్రచారాలు, సభలతో మునుగోడులో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గంపై నేతలు వరాల జల్లు కురిపిస్తున్నారు. నిన్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేసిన మంత్రి కేటీఆర్.. మునుగోడును తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై భగ్గుమన్నారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి.

ఇక మంత్రి కేటీఆర్ కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారాయన. ఎన్నికల సమయంలోనే కేసీఆర్‌ ఫ్యామిలీ నాటకాలు ఆడుతుందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా కేటీఆర్‌కు మునుగోడు గుర్తుకు వచ్చిందని ఎద్దేవాచేశారు. మూడున్నరేళ్ల నుంచి కేటీఆర్‌ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గం అభివృద్ధిపై చర్చించేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లితే అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని వాపోయారు. ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతున్నారని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయిస్తాయని, వెయ్యి కోట్లతో నియోజకవర్గాన్ని నెంబర్‌ వన్‌గా తీర్చితామన్నారు.

కాగా, గురువారం నాడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా కేటీఆర్‌ ప్రచారం చేశారు. మునుగోడుపై వరాల జల్లు కురిపించారు. కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో రాజగోపాల్ రెడ్డిపై ఆరోపణల పర్వాన్ని కొనసాగించారు. రూ.18 వేల కోట్లకు అమ్ముడు పోయాడని, కాంట్రాక్టుల కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరాడని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డికి ఓటు వేస్తే వృధా అవుతుందన్నారు. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య ఎన్నిక జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
గోళ్లలో మీ ఆయుష్షు రహస్యం.. ఎంత కాలం జీవిస్తారో సింపుల్‌గా ఇలా..
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా