
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మానవత్వం చాటు కున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించారు. అనంతరం బారి బాగోగుల గురించి ఆరా తీసి, మంచి చికిత్స అందించాలంటూ వైద్యులను ఆదేశించారు. మెదక్ జిల్లా చేగుంట జాగీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చేగుం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన మంత్రి కేటీఆర్.. తన కాన్వాయ్‌ని ఆపి, క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారిని తన కాన్వాయ్‌లోని ఓ వెహికిల్ ఎక్కించి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు.. మంచి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..