మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8 మంది విద్యార్థుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు మందలిస్తారనో.. స్నేహితులు ఏడిపిస్తారనో.. అర్ధాంతరంగా తనువులు చాలించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఒకరు, హైదరాబాద్‌లో నిజామాబాద్ ఆర్మూరుకి చెందిన మరొకరు, పటాన్చెరువులో ఇంకొకరు, హైదరాబాద్‌లో చదువుతున్న గద్వాల్ చెందిన మరో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ నేరెడ్మెట్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ రేవంత్ కుమార్, హైదరాబాద్‌లో చదువుతున్న ప్రకాశం జిల్లాకి చెందిన మరో విద్యార్థిని, ఖైరతాబాద్‌లో గౌతమ్ కుమార్ పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్తకోటకు చెందిన మరో విద్యార్థిని మార్కులు తక్కువ వచ్చాయని ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ పదో తరగతి ఫలితాలు 2023 విడుదల కానున్న విషయం తెలిసిందే. టెన్త్ ఫలితాలు విడుదల నేపథ్యంలో పిల్లల మానసిక స్థితిపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.