Telangana Covid-19: రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా రిపోర్టు ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై గురువారం ధర్మాసనానికి నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. క్లబ్బులు, థియేటర్లు, పబ్బులు, మద్యం షాపులపై కరోనా ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ప్రతీ ఆఫీస్ లో కరోనా వ్యాక్సిన్ ఇప్పించాలని పేర్కొంది. కరోనా టెస్టులను భారీగా పెంచాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. లాక్డౌన్ లేకపోయినా.. కనీసం కంటైన్మెంట్ జోన్లు అయినా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, దీనికోసం నిపుణులతో కమిటీ వేయాలని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని.. రాష్ట్రవ్యాప్తంగా కేసులు కూడా నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
Also Read: