Gold treasure: భూమి చదును చేస్తుంటే దొరికిన లంకె బిందెలు.. బంగారమే.. బంగారం.. అవాక్కయిన రైతు.. ఎక్కడంటే..?
పొలాన్ని దున్నుదామని వెళితే.. అకస్మాత్తుగా లంకెబిందెలు దొరికితే? అదే జరిగింది తెలంగాణాలోని జనగాం జిల్లాలో.. ఆ వివరాలు..
Gold treasure: పొలాన్ని దున్నుదామని వెళితే.. అకస్మాత్తుగా లంకెబిందెలు దొరికితే? అదే జరిగింది తెలంగాణాలోని జనగాం జిల్లాలో.. ఆ వివరాలు..
తెలంగాణలోని జనగాం జిల్లాలో బంగారు నిధి బయటపడటం సంచలనం సృష్టించింది. జిల్లాలోని పెంబర్తిలో ఈ నిధి లభించింది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం పెంబర్తి గ్రామానికి చెందిన రైతు తన పొలంలో భూమి చదును చేస్తున్నాడు. ఆ సమయంలో లంకె బిందె బయటపడింది. దానిలో బంగారం కనిపించే సరికి షాక్ తిన్న ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ బంగారు నిధి బయటపడ్డ భూమి గ్రామానికి చెందిన ఎస్సీ కులస్థుల భూమిగా తెలుస్తోంది. ఇటీవల ఘట్ కేసర్ కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ భూమిని కొనుగోలు చేసినట్టు సమాచారం.
పెంబర్తి వద్ద లభ్యమైన లంకె బిందెలో 18 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోలకు పైగా వెండి ఆభరణాలు లభ్యం అయ్యాయి. రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో ఆభరణాలు సీజ్ చేసి అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Telangana High Court: కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Corona Effect: కరోనా ప్రభావం మళ్లీ మొదలైందిగా… కీలక నిర్ణయం తీసుకున్న బేగం బజార్ వ్యాపారులు..