Telangana: తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500?

Telangana: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకం అమలుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వారి జీవితాల్లో..

Telangana: తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. మహిళల ఖాతాల్లో నెలకు రూ.2,500?

Updated on: Jul 23, 2025 | 7:07 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే. మహాలక్ష్మీ పథకంలో భాగంగా 18 సంవత్సరాలు దాటిన యువతులు, మహిళలకు నెలకు రూ.2500 అందించేందుకు సర్కార్‌ సిద్ధమవుతోంది. ఈనెల 25వ తేదీన జరిగే కేబినెట్‌ సమావేశంలో దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అన్ని విభాగాల నుంచి కేబినెట్‌ సమావేశంలో నివేదికలు పంపించాలని సీఎస్‌ రామకృష్ణారావు అధికారులకు సూచించారు. అలాగే బీసీ రిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ ముసాయిదా గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండటంతో దానిపై కూడా ఈ కేబినెట్‌ భేటీలో చర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో మహాలక్ష్మి పథకం అమలుకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. ఈ స్కీమ్‌ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా వారి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం మహిళలకు అందించాలని భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి