Fertility Centers: పేద దంపతులకు శుభవార్త..పిల్లలు లేని తల్లిదండ్రులకు సర్కార్‌ ఊరట

|

May 24, 2022 | 7:35 PM

సంతానం లేక వేల రూపాయలతో ప్రయివేట్ ఫెర్టిలిటీల చుట్టూ తిరుగుతున్న దంపతులకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంచి శుభవార్త చెబుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో

Fertility Centers: పేద దంపతులకు శుభవార్త..పిల్లలు లేని తల్లిదండ్రులకు సర్కార్‌ ఊరట
Fertility Centers
Follow us on

సంతానం లేక వేల రూపాయలతో ప్రయివేట్ ఫెర్టిలిటీల చుట్టూ తిరుగుతున్న దంపతులకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంచి శుభవార్త చెబుతోంది. ప్రభుత్వ ఆసుపత్రులలో త్వరలోనే సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తేనుంది. మొదటగా రాష్ట్రంలో ఏడున్నర కోట్ల తో మూడు ప్రాంతాల్లో అందుబాటులో కి రానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్టిలిటి కలిగిన పేదల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో ఫెర్టిలిటీ కేంద్రాల ఏర్పాటుకు వైద్య ఆరోగ్య శాఖ పనులు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మూడుచోట్ల ఏడున్నర కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాల ఏర్పాటుకు రెడీ అయ్యింది. సరైన ప్రామాణికత లేని పునరుత్పత్తి కలిగించు లెక్కలేనన్ని ఫెర్టిలిటీ సంస్థలు నెలకొల్పబడి ఇష్టా రాజ్యంగా పనిచేస్తున్నాయి. వీటివల్ల చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు తప్ప ఫలితం లేకుండా పోతుంది.

పిల్లలు కలగని దంపతుల నుంచి ప్రైవేట్‌ ఫెర్టిలిటీ కేంద్రాలు అధిక ఫీజులు తీసుకుంటున్న నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలకు మంచి వైద్య సదుపాయాలతో పాటు..సంతాన ప్రాప్తి కలిగించేలా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ గాంధీలో రెండున్నర కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాన్ని పూర్తి స్థాయి లో త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. మొదటగా రాష్ట్రంలో మూడుచోట్ల ఏడున్నర కోట్లతో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గాంధీ, పేట్లబుర్జ్‌తోపాటు వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానల్లో ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఒక్కొక్కటి రెండున్నర కోట్లతో స్థాపించబోమే సంతాన సాఫల్య కేంద్రం సంతానం లేనివారికి వరంగా మారనుంది.  గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఫెర్టిలిటి ఒపి నడుస్తుండగా..రోజుకి దాదాపు 40జంటలు గాంధీ ఫెర్టిలిటీని సంప్రదిస్తున్నారు. అతి త్వరలో పూర్తి స్థాయిలో ప్రైవేటుకు ధీటుగా గాంధీ లో ఫెర్టిలిటీ విభాగం అందుబాటులోకి వస్తుందన్నారు గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు.

ఇవి కూడా చదవండి