Government Schools: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. సర్కారు బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌..

విద్యార్థుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో బడులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

Government Schools: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. సర్కారు బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌..
Breakfast In Government Sch

Updated on: May 14, 2023 | 12:41 PM

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగి జావా కలిపిన బ్రేక్ ఫాస్ట్ అందజేస్తారు.దీంతోపాటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తృణధాన్యాలను మధ్యాహ్న భోజనంలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బెల్లం పౌడర్, రాగి పిండిని బడులకు అందజేయనుండగా, మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్లు రాగి జావాను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో వినూత్నంగా వారంలో ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీని అమలు చేస్తున్నారు.

విద్యార్థుల్లో ఎక్కువ మంది పిల్లలు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో బడులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ ఇవ్వాలని నిర్ణయించారు. బలవర్ధకమైన బెల్లం కలిపిన రాగిజావను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదివరకే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్‌ల సహకారంతో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..