AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!

దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణ ఎదుగుతోందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఐటీలో అగ్రగామిగా అవతరిస్తుందని, వ్యవసాయం, డెయిరీలో ఎంతో స్కోప్‌ ఉందంటున్నారు. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి

తెలంగాణతో అమెజాన్ భారీ ఒప్పందం.. రూ.60,000 కోట్ల పెట్టుబడులతో అతిపెద్ద డేటా సెంటర్!
Cm Revanth Reddy Mou With Amazon
Prabhakar M
| Edited By: |

Updated on: Jan 23, 2025 | 3:44 PM

Share

పెట్టుబడుల సాధనలో దూసుకుపోతోంది తెలంగాణ రాష్ట్రం. దావోస్‌ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దావోస్‌, సింగపూర్‌ డీల్స్‌తో సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం దావోస్ వేదికపై మరో భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో భాగంగా, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కంపెనీతో రూ.60,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం కుదిరింది. ఈ పెట్టుబడితో హైదరాబాద్‌ను దేశంలోనే డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

దావోస్‌లో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకెతో సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం, భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించారు. అమెజాన్ ఇప్పటికే 2030 నాటికి తెలంగాణలో 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మూడు డేటా సెంటర్లను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, అవి విజయవంతంగా నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన రూ.60,000 కోట్ల పెట్టుబడి ప్రణాళిక డేటా సెంటర్ల విస్తరణలో మరింత ముందడుగు వేయనుంది.

ఈ డేటా సెంటర్లు ఆధునిక అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు ఈ సదుపాయాలు అవసరాలను తీర్చడంలో మద్దతు అందిస్తాయి. అమెజాన్ విస్తరణకు అవసరమైన భూమిని కేటాయించాలని సంస్థ ప్రభుత్వం ముందుపెట్టగా, తెలంగాణ ప్రభుత్వం దీనికి తక్షణమే అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు ఇలాంటి భారీ పెట్టుబడులకు ముందుకు రావడం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రగతిశీల నిర్ణయాలకు నిదర్శనం. ఈ ఒప్పందం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలుకొలుపుగా మారనుంది” అని తెలిపారు.

ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రస్తుతం డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఈ ఒప్పందం తెలంగాణ ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అందిస్తున్న మద్దతు, సమర్ధవంతమైన పాలన విధానాలు రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..