Telangana: ఒక్క వాట్సప్ మెస్సేజ్‌తో చిటికెలో ప్రభుత్వ సర్టిఫికేట్లు.. ఈ ఒక్క నెంబర్ తెలిస్తే చాలు

WhatsAPP: తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 18న వాట్సప్ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా వాట్సప్‌లోనే ప్రభుత్వ సర్టిఫికేట్లను పొందవచ్చు. మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది.

Telangana: ఒక్క వాట్సప్ మెస్సేజ్‌తో చిటికెలో ప్రభుత్వ సర్టిఫికేట్లు.. ఈ ఒక్క నెంబర్ తెలిస్తే చాలు
Whatsapp Services

Updated on: Dec 16, 2025 | 5:11 PM

తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ ద్వారా సులువుగా సర్టిఫికేట్లు పొందేలా వెసులుబాటు కల్పించింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, మీసేవ కేంద్రానికి కూడా వెళ్లకుండా సులువుగా ఇంటి నుంచే ఫోన్ ద్వారా ప్రభుత్వ సర్టిఫికేట్లు పొందే అవకాశం కల్పించింది. కేవలం వాట్సప్‌లో ఒక నెంబర్‌కు హాయ్ అనే మెస్సేజ్ పెట్టడం ద్వారా మీరు డేట్ ఆఫ్ బర్త్, ఇన్‌కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్, డెట్ సర్టిఫికేట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ వంటి సర్టిఫికేట్లు చిటికెలో పొందవచ్చు. విద్యుత్, ట్రాఫిక్ చలాన్లు, ఆస్తి పన్ను వంటి వాటిని చెల్లించవచ్చు. దాదాపు 580కిపైగా ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా పొందే అవకాశం అందుబాటులోకి తెచ్చింది. మీ సేవ సర్వీసెస్ అనే వాట్సప్ పేరుతో ఈ ఏడాది నవంబర్ 18న తీసుకొచ్చిన ఈ సేవల గురించి తెలుసుకుందాం.

వాట్సప్‌లో ‘మీసేవ’ సేవలు

ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ పేరుతో ప్రభుత్వ డాక్యుమెంట్లు, ఆర్టీసీ, దేవాలయాల దర్శన టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అదే తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం మీ సేవలో లభించే అన్నీ సేవలను వాట్సప్‌లో తీసుకొచ్చింది. వాట్సప్‌లో 80969 58096 అనే నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ చేయడం ద్వారా మీరు సేవలను పొందవచ్చు. దాదాపు 38 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన 580కిపైగా సేవలను వాట్సప్‌లో పొందవచ్చు. దీని వల్ల మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

వాట్సప్‌లో ఎలా అంటే..?

-8096958096 నెంబర్‌కు వాట్సప్‌లో హాయ్ అని మెస్సేజ్ పెట్టండి

-మెనూ ఆప్షన్‌లో మీకు కావాల్సిన సేవను ఎంచుకోండి

-ఆధార్ ఓటీపీ ప్రక్రియను పూర్తి చేయండి

-అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి

-దరఖాస్తు ఫీజును చెల్లించండి

-దరఖాస్తు స్టేటస్, ఇతర వివరాలు మీకు వాట్సప్‌కు ఎప్పుడప్పుడు వస్తాయి

-సర్టిఫికేట్ సిద్దం కాగానే వాట్సప్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి