TS Govt: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. స్థానిక క్యాడర్‌ ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు..

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభ‌జ‌న ప్ర‌క్రియ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. స్థానిక‌త ఆధారంగానే ఉద్యోగుల విభ‌జ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు కేసీఆర్ సర్కార్..

TS Govt: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. స్థానిక క్యాడర్‌ ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు.. తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు..
Cm Kcr Telangana Employees
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 06, 2021 | 2:11 PM

CM KCR – TS Govt: రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగుల విభ‌జ‌న ప్ర‌క్రియ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. స్థానిక‌త ఆధారంగానే ఉద్యోగుల విభ‌జ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు కేసీఆర్ సర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ప్ర‌భుత్వ ఉద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక‌త ఆధారంగా ఉద్యోగుల విభ‌జ‌నకు రాష్ట్ర ప్ర‌భుత్వం విధివిధానాల‌ను ప్ర‌క‌టించింది. 2018 రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌కు లోబ‌డి, కొత్త జోన‌ల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభ‌జ‌న ఉంటుందని ప్రకటించింది. ఈ క్ర‌మంలో ఉద్యోగుల కేటాయింపు కోసం క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి పోస్టుల‌కు ఉమ్మ‌డి జిల్లా క‌లెక్ట‌ర్ నేతృత్వంలో, జోన‌ల్ పోస్టుల‌కు, మ‌ల్టీ జోన‌ల్ పోస్టుల‌కు జీఏడీ ముఖ్య‌కార్య‌ద‌ర్శి నేతృత్వంలో క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది.

ఎన్నిక‌ల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే ఈ  ప్ర‌క్రియను మొదలు పెట్టనుంది. మిగ‌తా జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్ అనంత‌రం ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోనుంది. సీనియార్టీ ప్రాతిప‌దిక‌న ఉద్యోగుల విభ‌జ‌న ఉండనుంది.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల‌కు కేటాయించిన పోస్టుల‌కు అనుగుణంగా విభ‌జ‌న జరుగుతుంది. 70%నికి పైగా స‌మ‌స్య‌లు ఉన్న దివ్యాంగుల‌కు ప్రాధాన్యత ఇవ్వ‌నున్నారు. పిల్ల‌ల్లో మాన‌సిక‌ దివ్యాంగులుంటే ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. వితంతువులు, దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు.

ఇవి కూడా చదవండి: Health Benefits: అయ్యో..! నలుపు అని ఫీల్ అవుతున్నారా.. ఇందులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు దాగున్నాయి..

Omicron Tension: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌.. 41 దేశాలకు పాకిన కొత్త వేరియంట్‌..!

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ ఔట్.. తొలి మ్యాచ్‌లో సారథిగా ఎవరంటే?