Rythu Bima Scheme: తెలంగాణ ప్రభుత్వం రైతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు ఆసరాగా ఉండేందుకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంతో ముఖ్యం. కరోనా మహమ్మారి తర్వాత బీమా పాలసీలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల్లో రైతు బీమా ఒకటి. ఈ పథకంలో చేరిన రైతులకు వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్రభుత్వం. బీమా సదుపాయం ఉన్న రైతులకు ఎలాంటి లోటు ఉండకుండా ప్రతి సారి బడ్జెట్‌ను కేటాయిస్తోంది ప్రభుత్వం.
అర్హులైన రైతులు ఈ రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది వ్యవసాయ శాఖ. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 1 వరకు గడువు ఇచ్చింది ప్రభుత్వం. రైతు ఏ కారణం వల్లనైనా మరణించినట్లయితే ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించేందుకు రైతు బీమా కింద ఈ పరిహారాన్ని అందిస్తోంది. తాజాగా కొత్త రైతుల కోసం ప్రభుత్వం రైతు బీమా కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోడానికి అర్హులైన కొత్త రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆగస్టు 1 వరకు గడువు ఇచ్చింది. రైతు ఏకారణం వల్లనైనా మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రైతు బీమా కింద రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది.#RythuBima pic.twitter.com/SJ1wNDqblx
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) July 26, 2022
కొత్త రైతులు ఆగస్టు 1 వరకు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. గత ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 22 వరకు కొత్తగా వ్యవసాయ భూములు కొని పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన 18 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. అలాగే పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో గ్రామ వ్యవసాయ విస్తరణ అదకారులకు రైతు బీమా దరఖాస్తులను సమర్పించాలి. రైతు ఏ కారణం చేతనైన మృతి చెందినట్లయితే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల వరకు సాయం పొందవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం 35.64 లక్షల మంది రైతులు పక్షాన రూ.1.465 కోట్లు ఎల్‌ఐసీ కంపెనీకు ప్రీమియం చెల్లించింది. ఇలా దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ అండగా నిలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వారి కుటుంబానికి భరోసా ఇస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి