ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలను అన్ని విధాల ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నిరుపేదలను అర్హులైన వారిని గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇచ్చేందుకు నియోజకవర్గానికి 3500 ఇళ్ళ చొప్పున ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మీరు కావాలనుకుంటే ట్రిపుల్ బెడ్ రూమ్ కూడా అవుతుంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
రెండు దశల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది మొదటి దశలో సొంత స్థలం ఉన్న నిరుపేదలను గుర్తించి అందులో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించుకునేందుకు ఐదు లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తుంది. రెండో దశలో సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వమే వారికి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్‌ని నిర్మించి ఇస్తుంది. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పూర్తిగా అర్హులైన నిరుపేదలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది. అందుకోసమే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. ఇందిరమ్మ కమిటీలు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుం.ది అర్హులని ఎంపిక చేసేందుకు కొత్త సాంకేతికతను కూడా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఇందుకు గాను ఒక ప్రత్యేకమైన రెవెన్యూ శాఖ యాప్‌ను రూపొందించింది. ప్రభుత్వం నిర్మించే ఇల్లు అంటే ఏదో నామ్ కి వస్తే ఎలా కాకుండా నిజంగా తన సొంత ఖర్చుతో ఒక పేదవాడు నిర్మించుకుంటే ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఎవరికైనా ఆర్థిక స్తోమత సహకరించి పెద్ద కుటుంబం ఉండి డబల్ బెడ్ రూమ్ తమకు సరిపోదు అనుకుంటే తన సొంత ఖర్చుతో ఇంకో గదిని నిర్మించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ విషయంపై శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎంతో సమావేశం నిర్వహించారు. పెద్ద కుటుంబం ఉండి ఆర్థిక స్తోమత ఉంటే డబల్ బెడ్ రూమ్‌ని ట్రిపుల్ బెడ్ రూమ్‌గా నిర్మించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే అదనపు గదికి అయ్యే ఖర్చును లబ్ధిదారుడే సొంతంగా భరించాల్సి ఉంటుంది. అయితే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను కేటాయించిన అవసరాన్ని బట్టి ఆ సంఖ్యను పెంచడానికి కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిపింది. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ ఇటీవలే ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి