Telangana: స్కూల్ పిల్లలకు సూపర్ న్యూస్.. ఇక నుంచి వారంలో మూడు రోజులు…

వేసవి సెలవులు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. త్వరలో స్కూల్స్ పున: ప్రారంభం అవ్వనున్నాయి. ఈ క్రమంలో స్కూల్ పిల్లలు ఎగిరి గంతేసే వార్త చెప్పింది ప్రభుత్వం. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telangana: స్కూల్ పిల్లలకు సూపర్ న్యూస్.. ఇక నుంచి వారంలో మూడు రోజులు...
Telangana Students
Follow us

|

Updated on: Jun 04, 2023 | 5:37 PM

స్కూల్ పిల్లలకు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నయ్. కరెక్ట్‌‌గా ఇంకో వారం రోజులో సెలవులు మిగిలి ఉన్నాయ్. జూన్ 12 నుంచి తరగతులు పున:ప్రారంభం అవ్వనున్నాయి. బడులు మొదలైన తొలి రోజు నుంచే.. వారికి మంచి ఫుడ్ అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన నుంచి ఆదేశాలు వెళ్లాయి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను కూడా ప్రభుత్వం తేల్చింది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మీల్స్‌కు అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా ఉంది. 9, 10 వ తరగతుల విద్యార్థులకు మాత్రం భోజనానికి అయ్యే ఖర్చును 100 శాతం తెలంగాణ సర్కారే భరించనుంది.

మిడ్ డే మీల్స్‌కు సంబంధించి ప్రభుత్వం.. ఏజెన్సీ నిర్వాహకులకు ఎంత చెల్లిస్తుందో కూడా వివరించింది. 1 నుంచి 5వ తరగతి స్టూడెంట్స్‌కు ఒక్కొక్కరికి రోజూ రూ.5.45 ఖర్చు పెడుతున్నారు. ఇక 8వ తరగతి విద్యార్థులకు రూ.8.17 ఇస్తున్నారు. 9,10వ తరగతి విద్యార్థులకు గుడ్డుతో కలిపి రూ.10.67 ఇవ్వనున్నారు. అయితే..  అన్ని తరగతుల విద్యార్థులకు సోమ, బుధ, శుక్రవారాల్లో మూడు రోజులు గుడ్డు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం స్టూడెంట్స్‌కు వెజిటెబుల్ బిర్యానీ పెట్టనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..