Telangana: ఆసక్తిగా మారిన పొంగులేటి పొలిటికల్ కెరీర్.. పార్టీలో చేరుతారా? కొత్త పార్టీ పెడతారా?

|

May 06, 2023 | 12:56 PM

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్న మాజీ ఎంపీ.. భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణ ఏంటో చెప్పడం లేదు. ఇదే సమయంలో సొంత పార్టీ ఏర్పాటు దిశగానూ ఆయన అడుగులు వేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Telangana: ఆసక్తిగా మారిన పొంగులేటి పొలిటికల్ కెరీర్.. పార్టీలో చేరుతారా? కొత్త పార్టీ పెడతారా?
Ponguleti Srinivas Reddy
Follow us on

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కదలికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ నేతలతో మంతనాలు చేస్తున్న మాజీ ఎంపీ.. భవిష్యత్‌ రాజకీయ కార్యాచరణ ఏంటో చెప్పడం లేదు. ఇదే సమయంలో సొంత పార్టీ ఏర్పాటు దిశగానూ ఆయన అడుగులు వేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పలువురు అభ్యర్థులు ప్రకటించిన పొంగులేటి.. తాజాగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలపైనా ఫోకస్‌ పెట్టారు. నల్లొండ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు మాజీ ఎంపీ. నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు నేతలతో సమావేశం అయ్యారు. ఇంకోవైపు రైతులకు మద్దతుగా ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రైతు భరోసా పేరుతో ర్యాలీ నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కలెక్టరేట్ ఎదుట రైతు దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి.. పదివేలు పరిహారం ఇస్తామని ప్రకటించారని, ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు, రైతులు, విద్యార్థులు పక్షాన పోరాటం చేయబోతున్నామని ప్రకటించారు పొంగులేటి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..