Telangana: టికెట్ కన్ఫామ్‌ అయినా తప్పని తిప్పులు.. ఇంతకీ ఆ ఎమ్మెల్యే భయానికి కారణమేంటీ.?

ఆ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ టికెట్ కాన్ఫామ్‌ చేశారు. ఇంకేటి ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి ఆయన.. కానీ ఆ ఎమ్మెల్యే ఆ పరిస్థితి లేదట.. మళ్ళీ టికెట్ తనకే కన్ఫర్మ్ అయిన కూడా ఆయన ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గానే ఉంటున్నాడట.. ఎప్పుడు ఏం జరుగుతోందో అనే అనుమానం ఆయన పట్టి పీడిస్తుందట.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆయనకు ఎందుకు అంత టెన్షన్ పట్టుకుందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Telangana: టికెట్ కన్ఫామ్‌ అయినా తప్పని తిప్పులు.. ఇంతకీ ఆ ఎమ్మెల్యే భయానికి కారణమేంటీ.?
Telangana Elections

Edited By:

Updated on: Oct 12, 2023 | 6:14 PM

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ఇలా విడుదలైందో లేదో వాతావరణం అలా ఒక్కసారిగా మారిపోయింది. రోజురోజుకీ టెన్షన్‌ పెరిగిపోతోంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతుండడం కొందరికి కలిసొస్తుంటే, మరికొందరికి మాత్రం కలవరపెడుతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యేకు ఇలాంటి విచిత్ర పరిస్థితే ఎదురైంది.

ఆ ఎమ్మెల్యేకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మళ్లీ టికెట్ కాన్ఫామ్‌ చేశారు. ఇంకేటి ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి ఆయన.. కానీ ఆ ఎమ్మెల్యే ఆ పరిస్థితి లేదట.. మళ్ళీ టికెట్ తనకే కన్ఫర్మ్ అయిన కూడా ఆయన ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గానే ఉంటున్నాడట.. ఎప్పుడు ఏం జరుగుతోందో అనే అనుమానం ఆయన పట్టి పీడిస్తుందట.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆయనకు ఎందుకు అంత టెన్షన్ పట్టుకుందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పటాన్ చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బాగా టెన్షన్ లో ఉన్నాడని పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ చర్చ నడుస్తోంది. మళ్ళీ ఆయనకే టికెట్ ఖరారు చేసినా కూడా.. సొంత పార్టీ నేతల నుంచి సహకారం కరువు అయ్యిందట.. పటాన్ చెర్ టికెట్ కోసం ఆశావహుల ప్రయత్నాలు ఇంక ఆగడం లేదని జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో ఆయన ఎటు వెళ్లిన, ఏం చేసినా మదిలో ఎప్పుడు ఇవే ఆలోచనలు తిరుగుతు న్నాయట. దీని వల్ల కొంత ఫ్రస్టేషన్‌కు కూడా గురవుతున్నట్లు ఆయన సన్నిహితులే చెబుతున్నారని టాక్‌. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే అభ్యర్థికి లేని కష్టాలు పటాన్ చెర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికే ఉన్నాయని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

ఇదిలా ఉంటే పఠాన్‌చెరు బీఆర్ఎస్ టికెట్ కోసం గూడెం మహిపాల్ రెడ్డితో పాటు, మరో కీలక నేత నీలం మధు కూడా పోటీపడ్డారు.. నీలం మధు కూడా మొదటి నుంచి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి బీఆర్ఎస్ టికెట్ మాత్రం గూడెం మహిపాల్ రెడ్డికే ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పటి నుంచి నీలం మధు ఇంకా సీరియస్ గా తన కార్యక్రమాలు చేస్తు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారాడని టాక్‌ నడుస్తోంది. పఠాన్ చెర్ బీఆర్ఎస్ టికెట్ విషయంలో అధిష్టానం మరోసారి ఆలోచన చేయాలని, నీలం మధుకే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు.

బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నీలం మధు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. తనకు ఇంకా బీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకం ఉందని 16వ తేదీ వరకు వేచి చూస్తానని, అప్పటికీ అధిష్టానం టికెట్ విషయంలో స్పందించకపోతే ఇతర పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్‌గా పోటీలో నిలుస్తానని చెప్పేశారు. అయితే నీలం మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ అధిష్టానంలో కూడా చర్చ జరుగుతోందని టాక్‌. నీలం మధుకి మాస్ ఫాలోయింగ్ బాగానే ఉందని..బీసీ(ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం,దీనికి తోడు పటాన్ చెర్ లో ముదిరాజ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎమ్మెల్యే వర్గంలో కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

ఇలా సొంత పార్టీ నేతలే తనకు మద్దతు ఇవ్వకుండా సొంత కుంపటి పెట్టుకుంటాం అని చెబుతూ ఉండడంతో ఎమ్మెల్యే గూడెం మదిలో గుబులు మొదలు అయ్యిందట.. నీలం మధు వెంట మరి కొంతమంది నేతలు వెళ్లే పరిస్థితి ఉందని చర్చ జరుగుతోంది పటాన్ చెర్ నియోజకవర్గ పరిధిలో. మరి ఈ వివాదానికి బీఆర్‌ఎస్ అధిష్టానం ఎలా చెక్‌ పెడుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..