Telangana Elections: వచ్చే పదేళ్లకు రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు..!
కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావించిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లీడర్లు, కేడర్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై మనసు పారేసుకుంటున్నారు.

దసరా ఉత్సవాల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లకు ముఖ్యమంత్రిని అవుతా అని.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. దసరా వేడుకల్లో భాగంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇప్పటి వరకు తనను సంగారెడ్డి ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడున్నారని.. వారి దయతోనే తాను ఈ స్థాయికి వచ్చాను అని గుర్తు చేశారు.
విజయదశమి రోజు తన మనస్సులో ఉన్న కోరికను ప్రజలందరి ముందు చెబుతున్నాను అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే.. మరో పదేళ్లకయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు. జగ్గారెడ్డి ఎవరికి ఫోన్‌లో కూడా అందుబాటులో ఉండడని.. ఇటీవల అందరూ అంటున్న మాటలకు కూడా సమాధానం చెప్పారు. తాను ఫోన్‌లో అందుబాటులో లేకున్నా కూడా నా భార్య, అనుచరులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటారన్నారు. రామాయణంలో శ్రీరామచంద్రునికే నిందలు తప్పలేదు.. ఆప్ట్రాల్ నేనెంత అని అన్నారు జగ్గారెడ్డి. ఈ దసరా అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలన్నారు. వచ్చే దసరా పండుగను కూడా బ్రహ్మండంగా జరుపుకుందాం అన్నారు.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త జోష్ వచ్చింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావించిన వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లీడర్లు, కేడర్‌లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. సీఎం కుర్చీపై మనసు పారేసుకుంటున్నారు.
ఆరు హామీల ప్రకటన, తెలంగాణలో జరిగిన ఎన్నికలలో పార్టీ పుంజుకుందని సూచించే కొన్ని ముందస్తు సర్వేలు కాంగ్రెస్ నాయకత్వంలో ఉత్సాహాన్ని నింపాయి. ఎన్నికల అనంతరం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంపై అప్పుడు ఆసక్తికర చర్చ మొదలైంది. 2018 ఎన్నికలలో భారీ ఆశల మధ్య, 119 మంది సభ్యులు ఉన్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ కేవలం 19 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఈ సారి అధికారంలోకి వస్తే తెలంగాణలో కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి కావాలనే వారి జాబితా బాగా ఉంది. వీరిలో కొందరు తమ చర్యల ద్వారా తమ స్థానాన్ని పరోక్షంగా నొక్కిచెబుతుండగా, మరికొందరు బహిరంగంగా తమ వాదనను ముందుకు తెస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్ నేత, పీసీసీ చీఫ్ జానా రెడ్డి, సీఎల్‌పీ నేత రేవంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, మహిళా కోటాలో సీతక్క ముందు వరుసలో ఉన్నారు.
ఈ క్రమంలోనే మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా తన మనసులోని మాటను అనుచరులతో పంచుకున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్ తనకు వస్తుందని జానారెడ్డి భావిస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే వివాదరహితుడిగా, అందరికి ఆమోదయోగ్యుడిగా అవకాశం వస్తుందని జానారెడ్డి అనుచరులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేతగా విశేష రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా తనకు సీఎం అయ్యే అవకాశం.. అర్హతలు ఉన్నాయని జానారెడ్డి భావిస్తున్నారట. దీంతో ఆయన తన రాజకీయ ప్రస్థానానికి రిటైర్‌మెంట్ ప్రకటించే ఆలోచన చేస్తున్నారట.
అందుకే ఎన్నికల్లో పోటీ విషయమై జానారెడ్డి యూ టర్న్ తీసుకున్నారట. ఈసారి ఆయన ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలు లేకపోలేదనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటివరకు జానారెడ్డి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ.. ఆయన కన్ను మాత్రం సీఎం కుర్చీ పైనే ఉందంటున్నారు అధికార బీఆర్ఎస్ ను ఢీ కొట్టాలంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని జానారెడ్డిని పార్టీ హైకమాండ్ ఆదేశించే అవకాశాలు కూడా లేకపోలేదట. మొత్తానికి కాంగ్రెస్ నేతల సీఎం కుర్చీ కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
