Telangana Elections: తెలంగాణపై ఈసీ డేగ కన్ను.. అసెంబ్లీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఈసీ ఆదేశాలతో సెంట్రల్ ఫోర్సెస్ ఎంట్రీ ఇచ్చాయి. దానిలో భాగంగా.. 100 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. నామినేషన్లు ఎన్నికల సమయానికి మరికొన్ని బలగాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. గతంతో పోలిస్తే రెట్టింపుగా సుమారు 20వేల కేంద్ర బలగాలు రంగంలోకి దిగబోతున్నాయి. ప్రస్తుతానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గాడ్స్ తెలంగాణకు చేరుకున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఈసీ నిఘా మరింత పెంచుతోంది. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ఈసీ ఆదేశాలతో సెంట్రల్ ఫోర్సెస్ ఎంట్రీ ఇచ్చాయి. దానిలో భాగంగా.. 100 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. నామినేషన్లు ఎన్నికల సమయానికి మరికొన్ని బలగాలు రాష్ట్రానికి చేరుకోనున్నాయి. గతంతో పోలిస్తే రెట్టింపుగా సుమారు 20వేల కేంద్ర బలగాలు రంగంలోకి దిగబోతున్నాయి. ప్రస్తుతానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్, నేషనల్ సెక్యూరిటీ గాడ్స్ తెలంగాణకు చేరుకున్నారు.
భూపాలపల్లి జిల్లాకు చేరాయి సెంట్రల్ ఫోర్సెస్. హమ్ ఆగయా అనే సంకేతాలిస్తూ కవాతు నిర్వహించారు జవాన్లు. భూపాలపల్లి పట్టణంలోని ఐదో గని స్వాగత తోరణం నుంచి హనుమాన్ ఆలయం వరకు బలగాల కవాతు కొనసాగింది. ఎన్నికల నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తుకు జిల్లా పోలీసులకు సహాయంగా కేంద్ర బలగాలు ఉంటాయన్నారు డీఎస్పీ రాములు. ఎన్నికలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలోనూ కేంద్ర బలగాలు అడుగు పెట్టాయి. నర్సంపేట పట్టణంలో పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి కవాతు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. మరోవైపు.. నిర్మల్ జిల్లాలో ల్యాండయ్యాయి కేంద్ర బలగాలు. ఎస్పీ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలో నిర్మల్‌లో కవాతు నిర్వహించారు. శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేదన్నారు ఎస్పీ. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారాయన.
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నాయి కేంద్ర సాయుధ బలగాలు. గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, బీ.వై.నగర్, సుందరయ్యనగర్ మీదుగా నేతన్న విగ్రహం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. ప్రస్తుతం రెండు కంపెనీల సాయుధ బలగాలు చేరుకోగా.. త్వరలో మరో రెండు కంపెనీల బలగాలు రానున్న చెప్పారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి గట్టి భద్రత ఏర్పాటు చేస్తామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి