Telangana Elections: వారి పునరాగమనం అయ్యేనా? కేసీఆర్ పంపిన సిగ్నల్స్ దేనికి సంకేతం? కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది. పాత కాపులు మళ్లీ హస్తం గూటికి తరలి వస్తున్నారా? కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కవుట్‌ అవుతుందా? కోమటిరెడ్డి చెప్పిందే జరుగుతుందా? జూపల్లి, పొంగులేటి రాకతో పాత మిత్రులు కాంగ్రెస్‌లోకి క్యూ కడతారా? ఇక కాంగ్రెస్‌కు కేసీఆర్‌ లవ్‌ సిగ్నల్స్‌ తాత్కాలికమా?

Telangana Elections: వారి పునరాగమనం అయ్యేనా? కేసీఆర్ పంపిన సిగ్నల్స్ దేనికి సంకేతం? కాకరేపుతున్న తెలంగాణ పాలిటిక్స్..
Congress
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 11, 2023 | 8:30 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది. పాత కాపులు మళ్లీ హస్తం గూటికి తరలి వస్తున్నారా? కర్ణాటక ఫార్ములా తెలంగాణలో వర్కవుట్‌ అవుతుందా? కోమటిరెడ్డి చెప్పిందే జరుగుతుందా? జూపల్లి, పొంగులేటి రాకతో పాత మిత్రులు కాంగ్రెస్‌లోకి క్యూ కడతారా? ఇక కాంగ్రెస్‌కు కేసీఆర్‌ లవ్‌ సిగ్నల్స్‌ తాత్కాలికమా? లేక భారీ వ్యూహమా! తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇంట్రస్టింగ్ విశ్లేషణ మీకోసం..

టీ.కాంగ్రెస్‌కు బూస్ట్‌ ఇస్తున్న కర్ణాటక విజయం..

కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం తెలంగాణ కాంగ్రెస్‌కు టన్నుల టన్నుల బూస్ట్‌ ఇస్తోంది. కర్ణాటక ఎన్నికల కౌంటింగ్‌ డే నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో జోష్‌ పెరుగుతూనే ఉంది తప్ప అణువంత కూడా తగ్గలేదు. గ్రౌండ్‌ లెవెల్లో పార్టీకి కావాల్సినంత బలం ఉంది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే, కాస్త చెమటోడిస్తే, గట్టిగా కాలు కదిపితే.. పార్టీకి తిరుగులేని విజయం దక్కుతుందన్న ఆశ ఇప్పుడిప్పుడే టీకాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. అందుకే టాప్‌ టెన్‌ లీడర్లు పాదయాత్ర అంటూ జనంతో టచ్‌లోకి వెళ్తున్నారు.

ఎన్నికల వరకు కామ్‌గా ఉండాలని ఆర్డర్‌..

ఎన్నికల వరకు ఎలాంటి గందరగోళం లేకుండా.. గిల్లికజ్జాల్లేకుండా కామ్‌గా ఉంటే చాలని పెద్దల ఉవాచ. అందుకే.. కొంతకాలంగా టీ కాంగ్రెస్‌లో ఉండే రొటీన్‌ రాజకీయం సైడైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కర్ణాటక కాంగ్రెస్‌ రాజకీయం హైలెట్‌ అవుతోంది. ముచ్చట ఏదైనా ఛలో బెంగళూరు అంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె సారథ్యంలో రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో పాతకాపుల కలయిక జరుగుతోంది. అందులో భాగంగానే పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల ఇతర నేతలు బెంగళూరు ఫ్లైటెక్కుతున్నారు, దిగుతున్నారు.

ఇవి కూడా చదవండి

పాతకాపులకు కోమటిరెడ్డి పిలుపు..

మరోవైపు కోమటిరెడ్డి కూడా పార్టీని వీడినవాళ్లందరినీ రారండోయ్‌ గెలిచేద్దాం అని బొట్టుపెట్టి మరీ పిలుస్తున్నారు. దగ్గరుండి బెంగళూరు పంపిస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్‌ కాదు.. కాంగ్రెస్సే తెలంగాణ తోపు అని గట్టిగా చెబుతున్నారు.

ఎక్స్‌ట్రా ఎనర్జీ నింపడానికి వస్తున్న ప్రియాంక..

ఇక ప్రియాంక టూర్‌తో పార్టీలో ఎక్స్‌ట్రా ఎనర్జీ నింపడానికి ట్రై చేస్తున్నారు. మరోవైపు కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌కు లవ్‌ సిగ్నల్స్‌ పంపుతున్నారు. గత అసెంబ్లీ సెషన్స్‌లో పదేళ్ల యూపీఏ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. అంత సులభంగా ఎవరినీ నెత్తికెత్తుకోని కేసీఆర్‌.. హఠాత్తుగా, ఎవరూ ఊహించని విధంగా, ఇన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంను ప్రశంసించడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనని, ఆయన చాలా లెక్కలు వేసుకొనే ఇలా చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలు.. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఆశ్చర్యానికి, కలవరపాటుకు గురి చేశాయి. ఆయన వ్యూహమేంటో అంతుచిక్కక సతమతమైనా.. కర్ణాటక విజయంతో ఆయన మాటలను పట్టించుకోవడం లేదనే వాదన కూడా ఉంది.

భవిష్యత్‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ కూటమి సాధ్యమా?

బీజేపీని విమర్శించేందుకు యూపీఏ ప్రభుత్వ హయాంను కేసీఆర్ అస్త్రంగా వాడుకున్నారని ఇప్పుడు భావించినా.. భవిష్యత్తులో అవసరమైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి సాధ్యమవుతుందనేలా ఆయన ఓ సిగ్నల్స్ పంపినట్టు అనిపిస్తోంది. కేసీఆర్ రాజకీయ తంత్రాలు, ఎత్తుగడల గురించి తెలిసిన వారు ఇదే అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2024 లోక్‍సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‍తో బీఆర్ఎస్ జత కట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‍తో పొత్తు వాదనను కేసీఆర్ సహా ఆయన పార్టీ నేతలు ప్రస్తుతం పూర్తిగా కొట్టిపారేయడంలేదు.

కేసీఆర్‌ ఎన్ని పాచికలేసినా.. ఎన్ని ఎన్నికల తంత్రాలు రచించినా.. టీ కాంగ్రెస్‌ నేతల్లో మాత్రం కర్ణాటక ఎఫెక్ట్‌ తగ్గడం లేదు. తెలంగాణలో కూడా అది వర్కవుట్‌ అవుతుందని, సక్సెస్‌ ఫార్ములా రిపీట్‌ అవుతుందని అనుకుంటున్నారు. ఆశ అడియాశ అవుతుందా.. అధికారం కల నెరవేరుతుందా అనేది తేలాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..